తెలంగాణ రాష్ట్రంలో లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో భారీగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారు. రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపిన వివరాలు ప్రకారం 7,000కు పైగా ఖాళీలు భర్తీ చేస్తారు.
ఇందులో ముందుగా 3035 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆమోదం తెలిపారని తెలిపారు. ఈ 3035 ఉద్యోగాలకు రెండు వారాల్లోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
అలాగే మరో 4000 ఉద్యోగాల భర్తీ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
ముందుగా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
- డ్రైవర్ – 2,000
- శ్రామిక్ – 743
- డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) – 114
- డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) – 84
- డిప్యూటీ మేనేజర్ లేదా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ – 25
- అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ – 15
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23
- సెక్షన్ ఆఫీసర్ (సివిల్) – 11
- అకౌంట్స్ ఆఫీసర్ – 06
- మెడికల్ ఆఫీసర్ (జనరల్) – 07
- మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) – 07