Headlines

ఆంధ్రప్రదేశ్ లో 488 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | APMSRB Recruitment 2024 | Andhra Pradesh Jobs Notifications

ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో 488 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక అభ్యర్థులు మాత్రమే అర్హులు.

ఈ నోటిఫికేషన్ ద్వారా వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన బ్రాడ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో వివిధ స్పెషాలిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే ఉద్యోగాలు భర్తీకి అర్హత కలిగిన వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 23వ తేదీ నుండి సెప్టెంబర్ 9వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ పూర్తిగా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగానికి త్వరగా అప్లై చేసుకోండి…ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

 🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : బ్రాడ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 488

🔥 అర్హతలు : 

  • సంబంధిత స్పెషాలిటీ లో PG (MD / MS / DNB) పూర్తి చేసి ఉండాలి.

🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం జీతంతో పాటు సూపర్ స్పెషాలిటీ Allowance 30,000/- అదనంగా ఇవ్వబడుతుంది.

🔥 ఫీజు : 

  • OC అభ్యర్థులకు 1000/-
  • ఎస్సీ , ఎస్టీ, బీసీ , EWS మరియు PH అభ్యర్థులకు ఫీజు 500/-

🔥 వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్సీ ,ఎస్టీ, BC, EWS అభ్యర్థులకు ఐదేళ్లు మరియు విన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు 10 ఏళ్ళు వయసులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఈ ఉద్యోగాలకు అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!