ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 3,500 డ్రైవర్ ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు…ఈ మేరకు అధికారులు ఒక నివేదిక కూడా సిద్ధం చేశారు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే పథకాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ ప్రభుత్వం అమలులోకి తీసుకొస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. కాబట్టి కొత్త బస్సులు అవసరం ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా పదవీ విరమణ కారణంగా ఆర్టీసీలో డ్రైవర్ల కొరత కూడా వేధిస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీలో కొత్తగా 3500 డ్రైవర్ పోస్టులను భర్తీ చేయాలని అధికారులు ఒక నివేదిక సిద్ధం చేశారు. ప్రభుత్వం అనుమతిస్తే ఈ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది..