1376 పోస్టులతో మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి పారామెడికల్ క్యాటగిరి పోస్టులకు దరఖాస్తుల కోరుతూ అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 20 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టుల్లో మొత్తం 1376 ఖాళీలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి
ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 16వ తేదీ లోపు ఆన్లైన్ లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు చెందిన అధికారిక వెబ్సైట్స్ లో అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు సంబంధించిన మరికొంత ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. తాజాగా విడుదలను చేసిన నోటిఫికేషన్ క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి అప్లై చేయండి.
🔥 రైల్వే నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారికి మన యాప్ లో తక్కువ ధరలో ఆన్లైన్ క్లాసెస్ కలవు. డెమో క్లాసులు చూడడానికి మా యాప్ డౌన్లోడ్ చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 1376
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : డైటీషియన్, నర్సింగ్ సూపరింటెండెంట్, ఆడియాలజిస్ట్ మరియు స్పీచ్ తెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, డెంటల్ హైజెనిస్ట్ ,డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్, లాబొరేటరీ సూపరింటెండెంట్, పెర్ఫ్యూజినిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, క్యాథ్ లేబరేటరీ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ , రేడియోగ్రాఫర్, స్పీచ్ తెరపిస్ట్, కార్డియాక్ టెక్నీషియన్, ఆప్తోమెట్రిస్ట్ , ఇసిజి టెక్నీషియన్, లాబరేటరీ, అసిస్టెంట్ ఫీల్డ్ వర్కర్
🔥 జీతము : 10+2 , GNM, బిఎస్సి నర్సింగ్, డిఫార్మసీ, బీఫార్మసీ మరియు పోస్టులను అనుసరించి వివిధ డిప్లమో మరియు డిగ్రీ వంటి అర్హతలు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
🔥 జీతము : పోస్టులను అనుసరించి పేస్కేల్ ఉంటుంది .
🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.
🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్ట వయసు 43 సంవత్సరాల వరకు ఉంటుంది
🔥 వయసులో సడలింపు వివరాలు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయస్సులో సడలింపు కూడా వర్తిస్తుంది. అనగా
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయవచ్చు.
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లో రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : ఈ మొత్తం వంద మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 70 మార్కులు అభ్యర్థులు అప్లై చేసుకున్న ఉద్యోగాల సంబంధిత సబ్జెక్ట్ నుండి వస్తాయి. మిగతా 30 మార్కులు జనరల్ అవేర్నెస్, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, జనరల్ సైన్స్ నుండి వస్తాయి.
- పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు వంద మార్కులకు ఇస్తారు.
- ప్రతి సరైన జవాబుకు ఒక మార్కు కేటాయిస్తారు.
- ప్రతి తప్పు సమాధానానికి ⅓ నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది.
🔥 ఫీజు :
- SC, ST , ఈబీసీ , ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులుకు – 250/-
- మిగతా అభ్యర్థులకు 500/- రూపాయలు
పరీక్ష రాసిన అభ్యర్థులకు బ్యాంకు చార్జీలు మినహాయించి ఫీజు రిఫండ్ చేస్తారు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 17-08-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-09-2024
🔥 అప్లికేషన్ లో సవరణలు చేయుటకు తేదీలు : సెప్టెంబర్ 17 నుండి 29వ తేదీ మధ్య అప్లికేషన్లు మార్పులు చేసుకోవచ్చు.
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి
Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..