Headlines

తెలంగాణ జాబ్ క్యాలెండర్ లో భర్తీ చేయబోయే పోస్ట్లు ఇవే | TG Jobs Calendar 2024-2025 | Telangana Jobs Calendar 2024 Vacancies List

తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు జాబ్ క్యాలెండర్ విడుదలైంది. ఈ జాబ్ క్యాలెండర్ ను రాష్ట్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు విడుదల చేశారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీలను ఈ జాబ్ క్యాలెండర్ లో ప్రకటించిన నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తారు. రిక్రూట్మెంట్ కు సంబంధించిన నోటిఫికేషన్లు, పోస్టులు క్యాటగిరీలు, నోటిఫికేషన్ విడుదల చేసే నెలలు, పరీక్షలు నిర్వహించే నెలలు, రిక్రూట్మెంట్ ఏజెన్సీలు మరియు పోస్టులకు అర్హతలు క్యాలెండర్లో ప్రకటించడం జరిగింది. ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించే నెలలు వివరాలుతో పాటు కొత్తగా ప్రకటించబోయే నోటిఫికేషన్లు సమాచారం వెల్లడించారు. వీటితోపాటు వివిధ సంస్థల్లో భర్తీ చేయబోయే ఇంజనీరింగ్ పోస్టులు, టీచర్ పోస్టులు, లెక్చరర్ పోస్టులు, అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు, పోలీస్ శాఖలో కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క వివరాలు వెల్లడించారు. టెట్ కు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ సమాచారం కూడా వెల్లడించారు. ఈ నోటిఫికేషన్స్ ద్వారా ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, బిఈ లేదా బిటెక్, వివిధ రకాల ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు, డి.ఫార్మసీ, బి.ఫార్మసీ, ఫార్మా.డి, జిఎన్ఎమ్, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు వివిధ రకాల అర్హత కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

ముందుగానే జాబ్ క్యాలెండర్ ప్రకటించడం వలన అర్హత గల నిరుద్యోగులు ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం ఉద్యోగాలకు బాగా సిద్ధం కావచ్చు. అంతేకాకుండా ఇచ్చిన తేదీల ప్రకారం రిక్రూట్మెంట్ కూడా పూర్తవుతుంది. 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/– 

అన్ని నోటిఫికేషన్ ఏ నెలలో విడుదల చేయబోతున్నారు ? ఏ నెలలో పరీక్షలు నిర్వహించబోతున్నారు ? అనే వివరాలు వెల్లడించారు కానీ ఏ నోటిఫికేషన్ లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారో అనేది వెల్లడించలేదు. నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో ఖాళీల సమాచారం వెల్లడిస్తామని ఉపముఖ్యమంత్రి గారు తెలిపారు.

జాబ్ క్యాలెండర్ ప్రకటన చేసిన తర్వాత ముందుగా వైద్య , ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీకే నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు.. సెప్టెంబర్ లో మొదటిగా స్టాఫ్ నర్స్ , ల్యాబ్ టెక్నీషియన్,  ఫార్మసిస్ట్ వంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి నవంబర్ లోనే పరీక్షలు నిర్వహిస్తామని జాబ్ క్యాలెండర్ లో తెలిపారు .

  • జాబ్ క్యాలెండర్ ప్రకారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే విడుదల చేసిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ లో, గ్రూప్ 2 ను డిసెంబర్ లో, గ్రూప్ 3 ఎగ్జామ్ నవంబర్లో నిర్వహిస్తారు.
  • తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి కొత్తగా గ్రూప్ 1,2,3 పోస్టులకు నోటిఫికేషన్స్ కూడా విడుదల చేస్తారు.
  • మళ్లీ టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరుగుతుంది.

✅ అధికారికంగా అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఉద్యోగాల సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!