ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోషణ అభియాన్ పథకంలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆగస్టు 10వ తేదీ లోపు అందజేయాలి.
ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా డిస్టిక్ కోఆర్డినేటర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, జీతం, ఎంపిక విధానము వంటి వాటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/–
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ , చిత్తూరు జిల్లా
🔥 ఉద్యోగం పేరు : జిల్లా కోఆర్డినేటర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ ప్రాజెక్టు కోఆర్డినేటర్
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 08
- జిల్లా కోఆర్డినేటర్ – 01
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 01
- బ్లాక్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ – 06
🔥 జీతము :
- జిల్లా కోఆర్డినేటర్ – 30,0000-
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 18,000/-
- బ్లాక్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ – 20,000/-
🔥 విద్యార్హతలు మరియు అనుభవం : సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారు ఈ పోస్టులకి అర్హులు. (అర్హతలకు సంబంధించిన సమాచారం కోసం పూర్తి నోటిఫికేషన్ చూడండి)
🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు.
🔥 గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు
🔥 వయసులో సడలింపు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి వయసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం సడలింపు వర్తిస్తుంది.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సదలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలిచి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై చేయు విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు అప్లికేషన్ నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను అప్లికేషన్ కు జతపరిచి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ పోస్టులకు అప్లికేషన్ అందజేయడానికి చివరి తేదీ ఆగస్టు 10
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయం, రెండవ అంతస్తు, అంబేద్కర్ భవనం, కలెక్టరేట్ , చిత్తూరు
🔥 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి
👇 👇 👇
🔥 Download Notification – Click here
🔥 Official Website – Click here