Headlines

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో నియామకాలపై ప్రభుత్వం కసరత్తు | భర్తీ చేయబోయే పోస్టులు ఇవే | AP Police Jobs Recruitment 2024 | AP Police Constable Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ నియామక ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి న్యాయస్థానాల్లో కొన్ని కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని తదుపరి కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం డిజిపి సి.హెచ్ ద్వారక తిరుమల రావు గారు మరియు పోలీస్ నియామక మండలి చైర్మన్ రామకృష్ణ గారు దీనిపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ పునః ప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

మీరు ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, రైల్వే, SSC, బ్యాంక్స్ మరియు పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతుంటే మన యాప్ వెంటనే డౌన్లోడ్ చేయండి.. APP లో అన్ని రకాల ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కోర్స్ 499/- Only ( ఈ క్లాసులు సీనియర్ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది, కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసిన తరువాతే మీకు నచ్చితే కోర్స్ తీసుకోవచ్చు) 

ఆంధ్రప్రదేశ్ లో 2022లో నవంబర్ 28వ తేదీన 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షకు 4,58,219 మంది హాజరు కాగా 95,208 ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం ఫిబ్రవరి 5న దీనికి సంబంధించిన ఫలితాలను విడుదల చేయడం జరిగింది. తర్వాత మార్చి 13వ తేదీ నుండి 20వ తేదీ వరకు శారీరిక సామర్ధ్య మరియు దేహ దారుడ్య పరీక్షలు నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసి దాని ప్రకారం హాల్ టికెట్స్ కూడా విడుదల చేశారు. అయితే ఆ సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో వీటిని వాయిదా వేయడం జరిగింది. తర్వాత కొన్ని కారణాలతో కోర్టులో కొన్ని కేసులు కారణంగా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగలేదు.

ప్రస్తుత ప్రభుత్వం ఈ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టడంతో న్యాయస్థానంలో కేసులు కొలిక్కి వస్తే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరగానే పూర్తవుతుంది. కొద్దిరోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి వంగలపూడి అనిత గారు రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రస్తుతం 19,999 ఖాళీ పోస్టులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పూర్తి చేస్తే త్వరలో ఈ ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!