ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీలకు సంబంధించి చాలా ముఖ్యమైన సమాచారం వచ్చింది. దీని ప్రకారం ఈ శాఖలో దాదాపుగా 25 వేల ఖాళీలు ఉన్నట్లుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నుండి ప్రభుత్వానికి నివేదిక వెళ్ళింది. ఇంత భారీ సంఖ్యలో ఖాళీలు ఉండడం వలన రోగులకు అందించాల్సిన చికిత్సపై భారీ ప్రభావం పడింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ శాఖలో మంజూరైన పోస్టులు, భర్తీ చేసిన పోస్టులు, ప్రస్తుతం ఉన్న ఖాళీలు వివరాలతో ప్రభుత్వానికి ఈ శాఖ నివేదిక అందించింది. ఈ నివేదిక ప్రకారం సుమారు 40000 మంది ఆశ పోస్టులతో పాటు కేంద్రం కొత్తగా మంజూరు చేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోస్టులు మరియు ఇతర పోస్టులతో కలిపి ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఒక లక్ష పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటికీ 25 వేల ఖాళీలు ఉన్నట్లుగా తాజా నివేదికలో స్పష్టమైనది.
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ విధానాన్ని అమలుపరిచామని చెబుతున్నప్పటికీ తాజా నివేదిక ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో ఇంకా భర్తీ కావలసిన పోస్టులు భారీగా ఉన్నట్లుగా తెలుస్తుంది.
🏹 AP నవోదయ స్కూల్ లో ఉద్యోగాలు
🏹 బంగారం నాణ్యత పరీక్షించే సంస్థలో ఉద్యోగాలు
🏹 రైల్వే లో 7,951 పోస్టులకు నోటిఫికేషన్
గత ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టుల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, MNO, FNO, GDA మరియు ఇతర అన్ని రకాల పారామెడికల్ మరియు ఇతర సిబ్బంది పోస్ట్లు కూడా ఒప్పంద ప్రాతిపదికన లేదా పోరుగు సేవల విధానంలోనే ప్రభుత్వం భర్తీ చేసింది. చాలా సంఖ్యలో వైద్యుల పోస్టులు కూడా ఈ విధానంలోనే భర్తీ చేయడం జరిగింది. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ జరగలేదు.
ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
- బోధనా ఆస్పత్రులలో దాదాపుగా 12వేల ఖాళీలు ఉన్నాయి. ఇందులో స్టాఫ్ నర్స్ – 2873 పోస్టులు , అసిస్టెంట్ ప్రొఫెసర్ – 590 , సీనియర్ రెసిడెంట్స్ – 924 , సివిల్ అసిస్టెంట్ సర్జన్ – 39 , గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్స్ – 113 , అసోసియేట్ ప్రొఫెసర్స్ – 286 , జనరల్ డ్యూటీ అటెండర్స్ – 639 , హెడ్ నర్స్ – 184 మరియు మేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు కూడా భారీగానే ఖాళీలు ఉన్నాయి.
- వైద్య విధాన పరిషత్ లో 13,127 పోస్టులు మంజూరు కాగా 1722 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో సివిల్ అసిస్టెంట్ స్పెషలిస్ట్ పోస్టులు -148, సివిల్ అసిస్టెంట్ సర్జన్ -234, స్టాఫ్ నర్స్ -197, గ్రేడ్ 1 ఫార్మసిస్ట్ – 115 మరియు డార్క్ రూమ్ అసిస్టెంట్ 114 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- రాష్ట్ర వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలో కూడా భారీ సంఖ్యలోనే ఖాళీలు ఉన్నట్లు సమాచారం.
- ఆయుష్ పరిధిలో ఆయుర్వేద హోమియో మరియు ఇతర వైద్య సేవలు అందించేందుకు 2565 పోస్టులు మంజూరు కాగా వీటిల్లో 1512 పోస్టులే భర్తీ చేశారు.
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు కూడా అధిక సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి.
- కుటుంబ ,ఆరోగ్య సంక్షేమ, ప్రజారోగ్య శాఖ మరియు జాతీయ ఆరోగ్య మిషన్ లో కూడా భారీ సంఖ్యలోనే ఖాళీలు ఉన్నాయి.
- ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ ప్రారంభించే సమయంలో ఈ శాఖలో ఈ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంది.
- అయితే గతంలో ఈ శాఖలో అన్ని ఉద్యోగాలను కాంట్రాక్ట్ లేదా ఔట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేయడం జరిగింది. కానీ ఈ ఉద్యోగాలకు అర్హులైన నిరుద్యోగులు శాశ్వత ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్ష నిర్వహించి పారదర్శకంగా పోస్టులు భర్తీ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వానికి నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.