తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన విడుదల చేశారు. రాబోయే 90 రోజుల్లో మరో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని ఆయన తెలిపారు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 31 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించామని ఆయన వెల్లడించారు.
గ్రూప్-1 , గ్రూప్-2, గ్రూప్ -3 తో పాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 30 వేల ఉద్యోగాలకు త్వరలో పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ముఖ్యమంత్రి గారు వెల్లడించారు. దీని ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే 60 వేల ఉద్యోగాల భర్తీ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లో ఏర్పడే ప్రతి ఖాళీని జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి లోని తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో శుక్రవారం 483 మంది ఫైర్ మ్యాన్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఇందులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అకాడమీలో నాలుగు నెలలపాటు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఫైర్ మ్యాన్ లకు దిశా నిర్దేశం చేశారు. పరేడ్ అనంతరం 157 మంది డ్రైవర్ ఆపరేటర్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగాల భర్తీపై పై వ్యాఖ్యలు చేశారు.
టీజీపీఎస్సీలో అనుభవజ్ఞులను నియమించి ఉద్యోగాల ప్రక్రియను పారదర్శకంగా చేపడతామని మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా వెల్లడించారు.
ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-