రైల్వే లో 10,844 పోస్టులతో NTPC నోటిఫికేషన్ విడుదల | RRB NTPC Recruitment 2024 | Railway NTPC Notification 2024

రైల్వే NTPC ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూసే వారికి శుభవార్త : త్వరలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో ఖాళీగా ఉన్న 10,884 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు…ఈ మేరకు తాజాగా ఒక ముఖ్యమైన సమాచారం వచ్చింది

రైల్వేలో ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన రిక్రూట్మెంట్ బోర్డ్ దాని ప్రకారం వరుస నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ వచ్చింది. ఇప్పటికే ALP, టెక్నీషియన్స్, RPF వంటి ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. త్వరలో జూనియర్ ఇంజనీర్, NTPC, పారామెడికల్ క్యాటగిరీ ఉద్యోగాలు, గ్రూప్ డి ఉద్యోగాలు మరియు మినిస్టీరియల్ ఐసోలేటెడ్ క్యాటగిరి పోస్టులకి కూడా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది.

కొద్దిరోజుల క్రితం వచ్చిన సమాచారం ప్రకారం ఈ నెలలోనే జూనియర్ ఇంజనీర్ మరియు ఇతర ఉద్యోగాల భర్తీకి 7,951 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. 

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం 10,884 పోస్టులతో నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరి లలో అండర్ గ్రాడ్యుయేట్ మరియు గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. NTPC పోస్టుల రిక్రూట్మెంట్ బాధ్యతలను అహ్మదాబాద్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కు అప్పగించింది. 

✅ ఖాళీల వివరాలు : 

భర్తీ చేయబోయే Non Technical Popular Categories పోస్టుల్లో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 3,404 ఖాళీలు ఉండగా గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 7,479 ఖాళీలు ఉన్నాయి.

Under Graduation Level Posts

  • Accounts Clerk Cum Typist – 361
  • Comm.Cum Ticket Clerk – 1985
  • Junior Clerk Cum Typist – 990
  • Trains Clerk – 68

Graduate Level Posts : 

  • Goods Trains Manager – 2684
  • Station Master – 963
  • Chief Comm. Cum Ticket Supervisor – 1737
  • Junior Accounts Asstt.Cum Typist – 1371
  • Sr. Clerk Cum Typist – 725

అర్హతలు : 

  • అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు 10+2 అర్హతలు ఉండాలి.
  • గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు డిగ్రీ అర్హత ఉండాలి.

✅ ఖాళీల లిస్ట్ కోసం క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి..

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!