ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు చాలా ముఖ్యమైన అప్డేట్ :-
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో వివిధ శాఖల మంత్రులు ఉద్యోగాల భర్తీపై ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వెలువడింది. అంతేకాకుండా పోలీస్ శాఖలో ఖాళీలు భర్తీకి సంబంధించిన కూడా ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత గారు పోలీస్ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ముఖ్యమైన ప్రకటన విడుదల చేశారు. పోలీస్ శాఖలో 750 + సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్లు భర్తీ చేస్తామని చెప్పారు. వీటితోపాటు కానిస్టేబుల్ పోస్టులపై ఉన్న సుప్రీంకోర్టు కేసును రివ్యూ పిటిషన్ వేసి 6,100 కానిస్టేబుల్ పోస్టులను త్వరగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో 2023 డిసెంబర్ 31 నాటికి 19,999 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు మరియు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందని వెల్లడించారు. ఈ నెలలో ఏ నోటిఫికేషన్ విడుదల చేస్తారు ? ఏ నెలలో ఏ పరీక్ష నిర్వహిస్తారు ? ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ ఎప్పటినుంచి ఎప్పటిలోపు పూర్తి చేస్తారు అనే వివరాలు జాబ్ క్యాలెండర్ లోనే వెల్లడిస్తామని తెలిపారు.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తొలి రోజే తన తొలి సంతకాన్ని డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ఫైల్ పైనే పెట్టడం జరిగింది.
ఎన్నికల్లో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ మేరకు స్కిల్ సెన్సెస్ – 2024 ఫైల్ పైన కూడా ముఖ్యమంత్రి గారు సంతకం చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే.