Headlines

ఆంధ్రప్రదేశ్ లో 3220 పోస్టులు భర్తీకి ఆదేశాలు జారీ చేసిన మంత్రి నారా లోకేష్ గారు | AP 3220 Jobs Recruitment 2024 | Latest jobs in Andhrapradesh 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరొక శుభవార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీల్లో 3220 పోస్టులు భర్తీ చేసేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ , అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఉన్నత విద్య కు సంబంధించి జరిపిన సమీక్షలో మంత్రి నారా లోకేష్ గారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. 

ఈ 3,220 పోస్టుల భర్తీ పారదర్శకంగా జరపాలని , ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి న్యాయపరమైన చిక్కులను తొలగించాలని అయిన అధికారులకు సూచించారు. అంతేకాకుండా ప్రతిభా ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన స్పష్టం చేశారు. 

ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి గత ప్రభుత్వము కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ నియామక ప్రక్రియ ముందుకు సాగలేదు.

🔥 అప్లికేషన్ విధానము : ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాలి. 

🔥 ఈ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. లేదా యూనివర్సిటీలు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు.

✅ ఫ్రెండ్స్ మీ టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!