ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చింది.
ఈ రైతు సేవా కేంద్రాల్లో ప్రస్తుతం భారీ స్థాయిలో ఖాళీలు ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చిన ప్రభుత్వం ఇందులో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసే రైతులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది.
గత ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో ఒక్కో కేంద్రంలో వ్యవసాయ లేదా ఉద్యానవన లేదా పట్టు పశుసంవర్ధక లేదా మత్స్య శాఖ సహాయకులను నియమించారు. ఒక రైతు భరోసా కేంద్రంలో ఇద్దరు సహాయకులను నియమించడం జరిగింది.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
అయితే గతంలో ఈ 10,778 రైతు భరోసా కేంద్రాలలో పనిచేసేందుకు మొత్తం 21,796 పోస్టులను మంజూరు చేయగా ప్రస్తుతం 15,667 మంది పనిచేస్తున్నారు. అంటే ఇంకా 6,129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇందులో వ్యవసాయ శాఖ పరిధిలో 596 పోస్టులు, ఉద్యానవన శాఖలో 1697 పోస్టులు , పశుసంవర్ధక శాఖ పరిధిలో 3739 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ప్రస్తుత ప్రభుత్వం ఈ రైతు భరోసా కేంద్రాలను రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చింది. ఇదే క్రమంలో ఈ సేవా కేంద్రాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసినట్లయితే రైతులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు కూడా ఈ పోస్టులు భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ కోసం ప్రస్తుతం ఎదురు చూస్తూ ఉన్నారు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-