ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డ్ వలంటీర్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన సమాచారం రావడం జరిగింది.
తాజాగా వచ్చిన ముఖ్యమైన సమాచారం ప్రకారం గ్రామ మరియు వార్డు వలంటీర్ల నియామక ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తుంది. గ్రామ, వార్డు వలంటీర్ల పోస్టుల విషయంలో ప్రభుత్వం ముందు ప్రస్తుతం కొన్ని కొత్త ప్రతిపాదనలు ఉన్నాయి.
✅ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
ప్రభుత్వం ముందు ఉన్న కొత్త ప్రతిపాదనలు ఇవే 👇 👇 👇
🔥 పేరు మార్పు : వలంటీర్ అనే పేరు మార్చి గ్రామ సేవక్ లేదా వార్డు సేవక్ అనే పేరుతో పిలుస్తారు. కొత్త రిక్రూట్మెంట్ ఈ విధంగానే జరగబోతుంది.
🔥 కాలపరిమితి : ఈ పోస్టులకి ఎంపిక అయ్యే వారికి నిర్దిష్ట కాల పరిమితికి ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. మూడేళ్లకు మించి వీరిని కొనసాగించరాదని , ప్రతి మూడేళ్లకు కొత్త రిక్రూట్మెంట్ చేయాలని ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
🔥 జీతము : గతంలో పనిచేసే వారికి నెలకు 5000/- రూపాయలు చొప్పున చెల్లించేవారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో వలంటీర్లకు పదివేల రూపాయలు జీతం ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎంపికయ్యే వారికి 10000/- చొప్పున జీతం ఇస్తారు.
🔥 వలంటీర్లకు వృత్తి నైపుణ్య శిక్షణ : వలంటీర్లుగా పనిచేసే వారికి ఉపయోగపడే విధంగా మూడేళ్ల కాలంలో ఏదో ఒక వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి వారు ఉద్యోగాలు పొందే విధంగా వారికి మార్గం చూపించాలని ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
🔥 సలహాలు – సూచనలు : ఈ వ్యవస్థలో తీసుకురాబోయే మార్పులపై ప్రజల నుంచి సలహాలు మరియు సూచనలు స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తుంది.
🔥 విధుల్లో కీలక మార్పులు : వలంటీర్లుగా సేవలందించే వారిని ఇకపై స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చి ఆ పనులను వాలంటీర్లు చేత చేయించాలని ప్రభుత్వం భావిస్తుంది. పథకాలు కింద చేసే డబ్బు పంపిణీ వలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలని ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
🔥 వలంటీర్ సేవలు : గతంలో వలంటీర్లుగా పని చేసేవారు ప్రతి 50 ఇళ్లకు తమ సేవలు అందించేవారు. ఇకపై వలంటీర్ గా ఎంపికయ్యే వారు తమ సేవలను వంద ఇళ్లకు అందించే విధంగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
🔥 అర్హత : గతంలో ఈ పోస్టులకు పదో తరగతి అర్హతగా ఉండేది.
వలంటీర్ వ్యవస్థ పై ప్రభుత్వ వర్గాలు ప్రస్తుతం ఈ విధంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ పోస్టుల రిక్రూట్మెంట్ కి సంబంధించి ముఖ్యమైన సమాచారం మన వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాము. కాబట్టి తరచూ మా వెబ్సైట్ ను ఓపెన్ చేస్తూ ఉండండి.
మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
🔥 UCO Bank లో 544 పోస్టులు – Click here
🔥 ఆర్టీసీ లో 3,035 పోస్టులు భర్తీ – Click here
🔥 పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 2700 పోస్టులు – Click here