బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బ్యాంకుల్లో ఆఫీసర్స్ స్కేల్ 1,2,3 మరియు ఆఫీసు అసిస్టెంట్ అనే పోస్ట్ లో భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుండి నోటిఫికేషన్ విడుదలైంది.
దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్స్ స్కేల్ 1,2,3 మరియు ఆఫీసు అసిస్టెంట్ ( మల్టీ పర్పస్) ఉద్యోగాలు భర్తీ కోసం అధికారికంగా భారీ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10,500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 43 గ్రామీణ బ్యాంకులు పాల్గొంటున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో కూడా పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఈ ఉద్యోగాలకు మీరు ఎంపిక అయితే మీ సొంత జిల్లాలోనే పనిచేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు.
మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బ్యాంక్స్ : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ , ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ , చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ , సప్తగిరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్
డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్స్ స్కేల్ 1,2,3 మరియు ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలకు తెలుగులో కూడా పరీక్ష నిర్వహిస్తారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ జూన్ 7న ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు జూన్ 27వ తేదీ లోపు అప్లై చేయాలి .
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( IBPS)
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 10,500
🔥 భర్తీ చేసే పోస్టులు : ఆఫీసర్స్ స్కేల్ 1,2,3 మరియు ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్)
🔥 అర్హతలు :
- పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- CA , MBA వంటి అర్హతలు గల వారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి.
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 07-06-2024 తేదీ నుండి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చేయడానికి చివరి తేదీ 27-06-2024
🔥 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : ఈ పోస్టులకు అప్లై చేసిన వారికి ఆగస్ట్ 2024 లో ప్రిలిమ్స్ నిర్వహిస్తారు.
🔥 ప్రిలిమ్స్ ఫలితాలు : ప్రిలిమ్స్ ఫలితాలు ఆగస్టు/ సెప్టెంబర్ 2024 లో విడుదల చేస్తారు
🔥 మెయిన్స్ పరీక్ష తేదీ : మెయిన్స్ పరీక్ష సెప్టెంబర్ /అక్టోబర్ 2024లో నిర్వహిస్తారు .
🔥 పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారు : జనవరి 2025
🔥 వయస్సు : 01-06-2024 నాటికి
- ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- ఆఫీసర్ స్కేల్-1 ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- ఆఫీసర్ స్కేల్-2 ఉద్యోగాలకు 21 నుండి 31 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి
- ఆఫీసర్ స్కేల్-3 ఉద్యోగాలకు 21 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 వయస్సు సడలింపు : ప్రభుత్వ నిబంధనలు ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు ఉంటుంది . అనగా
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది
🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు ఎంపికయ్యే ఉద్యోగాన్ని బట్టి ఉంటుంది.
- ఆఫీసర్ స్కేల్-1 ఉద్యోగానికి ఎంపిక అయితే 60 వేల నుండి 61 వేల మధ్య జీతము ఉంటుంది.
- ఆఫీసర్ స్కేల్-2 ఉద్యోగానికి ఎంపిక అయితే 75 వేల నుండి 77 వేల మధ్య చేత ఉంటుంది.
- ఆఫీసర్ స్కేల్-3 ఉద్యోగానికి ఎంపిక అయితే 80 వేల నుండి 90 వేల మధ్య జీతము ఉంటుంది.
- ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైతే 35 వేల నుండి 37 వేల మధ్య జీతం ఉంటుంది.
🔥 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలు 👇
- ఆంధ్రప్రదేశ్ లో ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి . అవి అనంతపూర్ , గుంటూరు / విజయవాడ , కాకినాడ , కడప ,కర్నూలు , ఒంగోలు, విజయనగరం ,విశాఖపట్నం , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి , శ్రీకాకుళం
- తెలంగాణ లో ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలు : హైదరాబాద్ / సికింద్రాబాద్ , వరంగల్ , కరీంనగర్ , ఖమ్మం , మహబూబ్ నగర్
👉 మెయిన్స్ పరీక్ష కేంద్రాలు :
- ఆంధ్రప్రదేశ్ లో మెయిన్స్ పరీక్షా కేంద్రాలు : గుంటూరు , కడప , కాకినాడ, కర్నూలు , విజయవాడ , నెల్లూరు , రాజమండ్రి, విశాఖపట్నం,
- తెలంగాణ లో మెయిన్స్ పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్ / సికింద్రాబాద్, కరీంనగర్
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- ఆఫీసర్ స్కేల్-1 ఉద్యోగాలకు ప్రిలిమ్స్ మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఉండదు
- ఆఫీసర్ స్కేల్-2,3 ఉద్యోగాలకు పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు :
- 175 /- (ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు , వికలాంగ అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు)
- మిగతా అభ్యర్థులు 850/- రూపాయలు ఫీజు చెల్లించాలి
🔥 పరీక్ష భాష : తెలుగు , ఉర్దూ , హిందీ , ఇంగ్లీష్ తో పాటు మరికొన్ని స్థానిక భాషల్లో ఉంటుంది .
🔥 అప్లికేషన్ విధానం : IBPS అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి .
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.