AP లో జిల్లాల వారీగా భర్తీ చేయబోయే పోస్టులు ఇవే | AP DSC District Wise Vacancies | APTET Results 2024 | AP DSC Latest News Today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 1వ తేదీన 16,347 పోస్టులతో  డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. 

గత ప్రభుత్వం 6100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దుచేసి కొత్తగా 16,347 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటుగానే టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నారు. చివరగా నిర్వహించిన టెట్ పరీక్షలో ఉత్తీర్ణులు కానీ వారు , కొత్తగా డీఈడీ , బీఈడీ పూర్తి చేసిన వారికి కూడా మళ్లీ అవకాశం ఇవ్వాలని ఉద్దేశంతో టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. 

🔥 గత DSC Notification కు అప్లై చేసిన వారు ఫీజు చెల్లించకుండా అప్లై చేయవచ్చు. 

🔥 తాజాగా విడుదల చేసిన టెట్ ఫలితాలు చూసేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి. 

టెట్ ఫలితాలు చెక్ చేసుకునేందుకు అభ్యర్థులు తమ క్యాండిడేట్ ఐడి , పుట్టిన తేదీ , మరియు వాళ్లు ఫలితాలు చెక్ చేసేటప్పుడు వచ్చిన వెరిఫికేషన్ కోడ్ వివరాలు నమోదు చేసి తమ మార్కులు తెలుసుకోవచ్చు. 

త్వరలో విడుదల కాబోతున్న టెట్ మరియు డీఎస్సీ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రక్రియ ఒకేసారి జరుగుతుంది. తేదీల్లో స్వల్ప మార్పులు మాత్రమే ఉంటాయి. ముందుగా టెట్ పరీక్ష నిర్వహిస్తారు. టెట్ పరీక్ష కు డీఎస్సీ కు మధ్యన కనీసం 30 రోజుల కాల వ్యవధి ఉండేవిధంగా అధికారులు షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. 

🔥 డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 

  • స్కూల్ అసిస్టెంట్ – 7,725 పోస్టులు
  • SGT – 6,371 పోస్టులు
  • TGT – 1781 పోస్టులు
  • PGT – 286 పోస్టులు
  • ప్రిన్సిపల్స్ – 52 పోస్టులు
  • పిఈటి – 132 పోస్టులు

🔥 భర్తీ చేయబోయే పోస్టులలో జిల్లా పరిషత్ , మండల పరిషత్ మరియు మున్సిపల్ స్కూల్స్ లో 14,066 పోస్టులు ఉన్నాయి. 

జిల్లాల వారీగా ఖాళీలు వివరాలు ఇలా ఉన్నాయి.. 

  • శ్రీకాకుళం – 543
  • విజయనగరం – 583
  • విశాఖపట్నం – 1134
  • తూర్పుగోదావరి – 1346 
  • పశ్చిమగోదావరి – 1067
  • కృష్ణ – 1213
  • గుంటూరు – 1159
  • ప్రకాశం – 672
  • నెల్లూరు – 673
  • చిత్తూరు – 1478
  • కడప – 709
  • అనంతపురం – 811
  • కర్నూలు – 2678

🔥 రెసిడెన్షియల్ స్కూల్స్ , మోడల్ స్కూల్స్ , బీసీ, గిరిజన స్కూళ్లలో 2,281 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

🔥 రైల్వేలో RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

🔥 APPSC , TGPSC, AP DSC , బ్యాంక్ , SSC ఉద్యోగాల ఆన్లైన్ కోర్సులు కూడా 499/- Only🔥 Download Our App 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!