ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,347 పోస్టులతో తొలి నోటిఫికేషన్ జూలై 1న విడుదల కాబోతోంది. అంతేకాకుండా ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించే అంశంపై కూడా ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలన చేస్తుంది.
ఈ నోటిఫికేషన్ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించినది. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ( 6,100 పోస్టులు ) రద్దుచేసి 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. గత డీఎస్సీ కి అప్లై చేసుకున్న వారు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా అప్లై చేయాల్సి ఉంటుంది. కొత్తగా అప్లై చేసేవారు ఫీజు చెల్లించి అప్లై చేయాల్సి ఉంటుంది.
మెగా డీఎస్సీ తో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెలలో నిర్వహించిన టెట్ లో అర్హత సాధించని వారు , కొత్తగా బీఈడీ , డిఈడీ పూర్తి చేసిన వారు కూడా ఉన్నారు కనుక మెగా డీఎస్సీ తో పాటు టెట్ నిర్వహించాలని భావిస్తున్నారు.
మెగా డీఎస్సీ మరియు టెట్ కు ఒకేసారి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. కానీ తేదీల్లో కొంచెం స్వల్ప మార్పులు ఉండేలా అధికారులు షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. ముందుగా టెట్ నిర్వహించి తరువాత ఒక నెల రోజుల సమయం ఇచ్చి డీఎస్సీ పరీక్షలు నిర్వహించే విధంగా అధికారులు షెడ్యూల్ పైన కసరత్తు చేస్తున్నారు.
ఈ మేరకు జూలై 1వ తేదీన మెగా డీఎస్సీ మరియు టెట్ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు.
టెట్ ఫలితాలు : మరో ముఖ్యమైన సమాచారం ఏమిటంటే ఫిబ్రవరి 27 నుండి మార్చ్ 6వ తేదీ వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను 25వర్ తేదిన విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ టెట్ కు రెండు లక్షల 67 వేల మంది దరఖాస్తులు చేసుకోగా రెండు లక్షల 35 వేల మంది పరీక్షలు రాశారు. టెట్ పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ సీట్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో టెట్ ఫలితాలు విడుదల చేయలేదు.
🔥 భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- స్కూల్ అసిస్టెంట్ – 7,725 పోస్టులు
- SGT – 6,371 పోస్టులు
- TGT – 1781 పోస్టులు
- PGT – 286 పోస్టులు
- ప్రిన్సిపల్స్ – 52 పోస్టులు
- పిఈటి – 132 పోస్టులు
🔥 రైల్వేలో RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🔥 APPSC , TGPSC, AP DSC ఉద్యోగాల ఆన్లైన్ కోర్సులు కూడా అతి తక్కువ ధరలో మన యాప్ లో…
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.