డిగ్రీ అర్హతతో 17,727 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | SSC CGL Notification 2024 | Staff Selection Commission CGL Notification 2024 in Telugu

డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. 

భారీ స్థాయిలో 17,727 పోస్టులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అప్డేట్ చేయబడిన ఖాళీలు అధికారిక వెబ్సైట్ లో ప్రకటించడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, రైల్వే మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పనులు శాఖ , కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్నుల శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, కాగ్ , CGDA, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ వంటి కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జూన్ 24వ తేదీ నుండి జూలై 24వ తేదీ లోపు అప్లై చేయాలి. 

నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు తప్పకుండా త్వరగా అప్లై చేసుకోండి. 

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ App లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians , SSC. Bank ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : స్టాఫ్ సెలక్షన్ కమిషన్

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 17,727 పోస్టులు 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : వివిధ శాఖల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ,రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్ , జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ , ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్, టాక్స్ అసిస్టెంట్ , సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ వంటి వివిధ రకాల ఉద్యోగాలు.

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ 

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 24-06-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 24-07-2024

🔥 🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • ఇన్స్పెక్టర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ అనే ఉద్యోగాలకు శారీరిక దారుఢ్య పరీక్షలు మరియు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు.

✅ పరీక్ష తేదీ : టైర్-1, టైర్-2 పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

  • రెండు కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.
  • September నుండి October నెలల్లో టైర్-1 పరీక్ష నిర్వహిస్తారు.
  • డిసెంబర్ లో టైర్-2 పరీక్ష నిర్వహిస్తారు. 

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

🔥 గరిష్ట వయస్సు : 32 సంవత్సరాలు 

🔥 వయస్సు సడలింపు : 

  1. ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  2. ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
  3. దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

🔥 అప్లై విధానం : ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి . 

అవి చీరాల , గుంటూరు , కాకినాడ , కర్నూలు , విజయవాడ , విజయనగరం ,విశాఖపట్నం, విశాఖపట్నం , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి , హైదరాబాద్ , వరంగల్ , కరీంనగర్.

🔥 ఫీజు : 100/- 

  • మహిళలు, ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు , విభిన్న ప్రతిభావంతులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు నుండి మినహాయింపు కలదు.

🔥 అప్లికేషన్ విధానం : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేయాలి.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!