సౌత్ సెంట్రల్ రైల్వే లో విజయవాడ రైల్వే డివిజన్ లో 59 ఫెసిలిటీటర్ పోస్టుల నియామకం కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం పై విజయవాడ PRO స్పందించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
✅ Notification వివరాలు తెలుగు లో – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
విజయవాడ రైల్వే డివిజన్ లో గత నెల 10 తేదిన ఇచ్చిన ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ (ఏటీవీఎం) ఫెసిలిటేటర్ నియామకం కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ పై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మ వద్దని విజయవాడ రైల్వే PRO నుస్రత్ మండ్రుప్కర్ తెలిపారు.
తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటనలో ఏటీవీఎం ఫెసిలిటేటర్లుగా నియమితులైన వారు రైల్వేలో ఉద్యోగుల కిందకు వస్తారని, వారికి జీతభత్యాలు రైల్వేశాఖ ఇస్తుందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోందన్నారు. అందులో ఏమాత్రం నిజం లేదని ఖండించారు.
విజయవాడ డివిజన్ వ్యాప్తంగా 26 స్టేషన్లలో ఏటీవీఎం మిషన్లు అందుబాటులో ఉండగా అక్కడ టికెట్లు జారీ చేయడంలో ప్రయాణికులకు సహాయంగా ఉండేందుకు మాత్రమే ఏటీవీఎం ఫెసిలిటేటర్లను నియమించనున్నట్లు తెలిపారు. వారికి కేవలం టికెట్ల అమ్మకంపై 3 శాతం కమీషన్ మాత్రమే ఉంటుందన్నారు. అంతకు మించి వారికి ఎటువంటి స్థిరమైన జీతం గాని, ఉద్యోగ ప్రయోజనాలు గాని ఉండవని స్పష్టం చేశారు.
ఇటువంటి తప్పుదారి పట్టించే సమాచారం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తపడాలని ఆమె సూచించారు.
🔥 ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్రింద ఉన్న లింక్స్ క్లిక్ చేయండి.
ఈ పోస్టులకు రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు మరియు అర్హత గల నిరుద్యోగులు కూడా అప్లై చేయవచ్చు. అప్లై చేయడానికి ఉండవలసిన విద్యార్హత 10వ తరగతి
✅ Notification వివరాలు తెలుగు లో – Click here
మరికొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 👇
▶️ రైల్వేలో 22,364 కొత్త ఉద్యోగాలు భర్తీ
▶️ ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా జాబ్ మేళాలు