రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త… రైల్వేలో గతంలో విడుదల చేసిన ALP ఉద్యోగాల సంఖ్యను భారీగా పెంచుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది.
ఈ ఉద్యోగాలకు ఈ సంవత్సరం జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
గతంలో 5696 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఇప్పుడు ఆ పోస్టుల సంఖ్యను 18,799 వరకు పెంచారు.
తాజాగా విడుదల చేసిన నోటీస్ ద్వారా గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో జోన్ల వారీగా ఉన్న ఖాళీలు మరియు ప్రస్తుతం పెరిగిన ఖాళీలతో జోన్లవారీగా ఖాళీలు వివరాలు తెలియజేయడం జరిగింది.
పోస్టుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ పోస్టులకు అప్లై చేసుకున్న నిరుద్యోగులకు ఇది చాలా పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు.
నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ( సికింద్రాబాద్ రైల్వే జోన్ ) లో 585 పోస్ట్లు ఉండగా తాజాగా పెంచిన పోస్టులతో 1949 కి చేరింది. అత్యధికంగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 3973 పోస్టులు ఉన్నాయి.
పోస్టుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అభ్యర్థులకు జోన్ మార్చుకునే అవకాశం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఇస్తుంది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన నోటీసులో పేర్కొంది.
అయితే గతంలో అప్లై చేయని అభ్యర్థులు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోవచ్చు.
✅ మీరు రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా ? మన యాప్ లో కేవలం 499/- రూపాయలకే సిలబస్ ప్రకారం పూర్తి ఆన్లైన్ కోర్స్ ఇస్తున్నాం. ఈ క్లాసులో మీరు ఎప్పుడైనా ఎక్కడి నుండి అయినా ఎన్నిసార్లు అయినా చూడవచ్చు ..
ALP, గ్రూప్ D , NTPC , RPF ఉద్యోగాల కోర్సులు కోసం మా APP Download చేయండి.
▶️ Download Our APP – Click here
గతంలో విడుదల చేసిన ALP నోటిఫికేషన్ మరియు తాజాగా పోస్ట్లు పెంచిన నోటీస్ లు క్రింద ఉన్న లింక్స్ ఉపయోగించి డౌన్లోడ్ చేయండి.
🔥 Download Previous Notification
🔥 Download ALP Vacancies Increased Notice