Headlines

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి మొదలైన కసరత్తు | TSMHSRB Notifications 2024 | 5,348 Jobs Recruitment in Telangana 

తెలంగాణ రాష్ట్రంలో మార్చిలో 5,348 వైద్య ఆరోగ్యశాఖ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది. తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ ఉద్యోగాలు భర్తీ జరగలేదు. ఎన్నికల కోడ్ ప్రస్తుతం ముగియడంతో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. రానున్న వర్షాకాలంలో డెంగీ మరియు ఇతర విష జ్వరాలు విజృంభించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిల్లో ఖాళీలు అన్నింటినీ భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వైద్య, ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారిచేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పోస్టులు భర్తీకి ప్రస్తుతము కసరత్తు జరుగుతుంది.

త్వరలో 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు , 193 ల్యాబ్ టెక్నీషియన్ మరియు 31 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు నోటిఫికేషన్లు జారీ చేస్తుంది.

గతంలో ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన పోస్టుల్లో 1610 వైద్యులు పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 636 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు , 1014 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు కూడా ఉన్నాయి. 

తెలంగాణలో కొద్ది నెలల క్రితం వైద్య , ఆరోగ్య శాఖలో దాదాపు 7వేల స్టాఫ్ నర్స్ పోస్టుల రిక్రూట్మెంట్ పూర్తి చేశారు. ఈసారి భర్తీ చేయబోయే పోస్టుల్లో 1988 స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ ఉద్యోగాలే కాక 764 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు , 191 ఫార్మసిస్ట్ పోస్టులు, 85 ఏఎన్ఎం పోస్టులు కూడా ఉన్నాయి. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన ఈ పోస్టులకు తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసి నియామక ప్రక్రియను పూర్తి చేస్తుంది.

అతి తక్కువ ధరలలో బ్యాంక్ , RRB , SSC  , APPSC, TSPSC మరియు నర్సింగ్ ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 

✅ అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలు మాత్రమే

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!