నిరుద్యోగులకు ప్రభుత్వ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( IBPS ) శుభవార్త చెప్పింది.
దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్స్ స్కేల్ 1,2,3 మరియు ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ కోసం అధికారికంగా భారీ నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9,995 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 43 గ్రామీణ బ్యాంకులు పాల్గొంటున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో కూడా పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఈ ఉద్యోగాలకు మీరు ఎంపిక అయితే మీ సొంత జిల్లాలోనే పనిచేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు.
మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బ్యాంక్స్ : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ , ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ , చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ , సప్తగిరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్
డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్ 1,2,3 మరియు ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలకు తెలుగులో కూడా పరీక్ష నిర్వహిస్తారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ జూన్ 7న ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు జూన్ 27వ తేదీ లోపు అప్లై చేయాలి .
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
✅ నోట్ల ముద్రణ సంస్థలో ఉద్యోగాలు
నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( IBPS)
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 9995
🔥 అర్హతలు :
- పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- CA , MBA వంటి అర్హతలు గల వారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి.
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 07-06-2024
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 27-06-2024
🔥 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : ఆగస్ట్ 2024 లో
🔥 ప్రిలిమ్స్ ఫలితాలు : ఆగస్టు/ సెప్టెంబర్ 2024 లో విడుదల చేస్తారు
🔥 మెయిన్స్ పరీక్ష తేదీ : సెప్టెంబర్ /అక్టోబర్ 2024లో నిర్వహిస్తారు .
🔥 పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారు : జనవరి 2025
🔥 వయస్సు : 01-06-2024 నాటికి
- ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- ఆఫీసర్ స్కేల్-1 ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
- ఆఫీసర్ స్కేల్-2 ఉద్యోగాలకు 21 నుండి 31 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి
- ఆఫీసర్ స్కేల్-3 ఉద్యోగాలకు 21 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
🔥 వయస్సు సడలింపు : ప్రభుత్వ నిబంధనలు ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు ఉంటుంది .
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది
🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు ఎంపికయ్యే ఉద్యోగాన్ని బట్టి ఉంటుంది.
- ఆఫీసర్ స్కేల్-1 ఉద్యోగానికి ఎంపిక అయితే 60 వేల నుండి 61 వేల మధ్య జీతము ఉంటుంది.
- ఆఫీసర్ స్కేల్-2 ఉద్యోగానికి ఎంపిక అయితే 75 వేల నుండి 77 వేల మధ్య చేత ఉంటుంది
- ఆఫీసర్ స్కేల్-3 ఉద్యోగానికి ఎంపిక అయితే 80 వేల నుండి 90 వేల మధ్య జీతము ఉంటుంది
- ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైతే 35 వేల నుండి 37 వేల మధ్య జీతం ఉంటుంది.
🔥 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలు 👇
- ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి . అవి అనంతపూర్ , గుంటూరు / విజయవాడ , కాకినాడ , కడప ,కర్నూలు , ఒంగోలు, విజయనగరం ,విశాఖపట్నం , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి , శ్రీకాకుళం , హైదరాబాద్ / సికింద్రాబాద్ , వరంగల్ , కరీంనగర్ , ఖమ్మం , మహబూబ్ నగర్
👉 మెయిన్స్ పరీక్ష కేంద్రాలు : గుంటూరు , కడప , కాకినాడ, కర్నూలు , విజయవాడ , నెల్లూరు , రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్ / సికింద్రాబాద్, కరీంనగర్
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :
- ఆఫీసర్ స్కేల్-1 ఉద్యోగాలకు ప్రిలిమ్స్ మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలు ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఉండదు
- ఆఫీసర్ స్కేల్-2,3 ఉద్యోగాలకు పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు :
- 175 /- ( ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు , వికలాంగ అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు )
- మిగతా అభ్యర్థులు 850/- రూపాయలు ఫీజు చెల్లించాలి
🔥 పరీక్ష భాష : తెలుగు , ఉర్దూ , హిందీ , ఇంగ్లీష్ తో పాటు మరికొన్ని స్థానిక భాషల్లో ఉంటుంది .
🔥 అప్లికేషన్ విధానం : IBPS అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి .
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here