ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి తాజాగా ఒక వెబ్ నోట్ విడుదలైంది. దీని ప్రకారం గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ లో పోస్టుల వారీగా ప్రిఫరెన్స్ , జోన్స్ లేదా జిల్లాల వారీగా ప్రిఫరెన్స్ మరియు పరీక్ష కేంద్రాల ప్రిఫరెన్స్ లను జూన్ 5 నుంచి జూన్ 18వ తేదీలలో తెలపాలని కోరింది.
అంతేకాకుండా జూలై 28వ తేదీన ఉదయం మరియు మధ్యాహ్నం ఆఫ్లైన్ విధానంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
🔥 Download Official Web Notice
APPSC గ్రూప్ 2 కోర్స్ ఇప్పుడు కేవలం – 399/- రూపాయలకే..
APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పూర్తి కోర్సు – 499/- రూపాయలకే
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
ఈ నోటిఫికేషన్ ను 2023 లో డిసెంబర్ 7వ తేదీన వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి విడుదల చేశారు. డిసెంబర్ 21వ తేదీ నుండి జనవరి 10వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించారు. నోటిఫికేషన్ విడుదల సమయంలో 897 ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. తర్వాత పోస్టుల సంఖ్య 905 కు చేరింది. ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రీమినరీ పరీక్షను ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వెనుతుల మేరకు ఒక్క పోస్ట్ కు 100 మంది చొప్పున ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు ఎంపిక చేశారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు – 331 ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 ఉన్నాయి.
- డిప్యూటీ తహసిల్దార్ – 114
- ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ – 150
- గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్ – 04
- గ్రేడ్ 2 సబ్ రిజిస్ట్రార్ – 16
- అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ – 28
వీటితోపాటు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ , సీనియర్ ఆడిటర్, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్ మరియు జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు 4,83,525 మంది అప్లై చేసుకున్నారు.
అప్లై చేసుకున్న అభ్యర్థుల్లో 4,04,039 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.