తెలంగాణ రాష్ట్రంలో 3 వేల పోస్టులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఈ మూడు వేల పోస్టుల్లో 2,000 డ్రైవర్ కం కండక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్టీసీ పంపించిన ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఆఈ పథకం అమల్లోకి రావడం వలన బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగి ఆక్యుపెన్సి నిష్పత్తి 100% పెరిగింది. ఈ నేపథ్యంలో సిబ్బందిపై పని భారం పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొత్తగా 3,000 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.
ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మరొక ముఖ్యమైన సమాచారం ఏమిటి అంటే ఆర్టీసీలో ఇకపై కండక్టర్, డ్రైవర్ పోస్టుల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్స్ విడుదల చేయరు .
ఉద్యోగంలో చేరిన వ్యక్తి అవసరాన్ని బట్టి డ్రైవర్ గా మరియు కండక్టర్ గా పని చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం డ్రైవర్ కం కండక్టర్ అనే పేరుతో ఉమ్మడి నోటిఫికేషన్ విడుదల చేసే ఆలోచనలో సంస్థ ఉంది. దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది
ఆర్టీసీ భర్తీ చేయబోయే పోస్టుల సంఖ్య క్రింది విధంగా ఉంది.
- డ్రైవర్ పోస్టులు కం పోస్టులు – 2000
- శ్రామిక్ పోస్టులు – 743
- డిప్యూటీ సూపరింటెండెంట్ ( మెకానిక్ ) – 114
- డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) – 84
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23
- మెడికల్ ఆఫీసర్ – 14
- సెక్షన్ ఆఫీసర్ (సివిల్) -11
- అకౌంట్స్ ఆఫీసర్ – 06
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.