తెలంగాణ రాష్ట్రంలో నేడు ఇంటర్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలు అధికారికంగా విడుదల చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం , ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శృతి ఓజా ఈ ఫలితాలను విడుదల చేశారు.
ఫస్ట్ ఇయర్ లో 2.87 లక్షల మంది, సెకండ్ ఇయర్ లో 3.22 లక్షల మంది పాసయ్యారు.
ఫస్ట్ ఇయర్ లో 60.01%, సెకండ్ ఇయర్ లో 64.18% మంది ఉత్తీర్ణత సాధించారు.
ఫస్ట్ ఇయర్ లో బాలికలు 68.35%, బాలురు 51.05% మంది పాసయ్యారు.
సెకండ్ ఇయర్ లో బాలికలు 72.53%, బాలురు 56.01% మంది ఉత్తీర్ణులయ్యారు.
ఫస్ట్ ఇయర్ లో రంగారెడ్డి జిల్లా 71.07శాతంతో టాప్ ప్లేస్ లో, సెకండియర్ లో ములుగు 82.95 శాతంతో తొలి స్థానంలో నిలిచింది.
రేపటి నుంచి మే 2వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం తెలిపారు.
సప్లిమెంటరీ పరీక్షలను మే , జూన్ నెలలో నిర్వహిస్తామని తెలిపారు.
పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.
విద్యార్థులు క్రింది లింక్స్ ఆధారంగా ఈ ఫలితాలను తమ మొబైల్ లోనే చెక్ చేసుకోవచ్చు.