ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఫలితాలను ఈరోజు అధికారికంగా విడుదల చేశారు.
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు ఈ ఫలితాలు విడుదల చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3,473 పరీక్ష కేంద్రాల్లో మార్చి 18 నుండి 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను రెగ్యులర్ గా 6,23,000 మంది విద్యార్థులు రాశారు. ప్రైవేట్ గా 1.02 లక్షల మంది పరీక్షలు రాసారు.
ఈ ఫలితాల్లో ఆకుల వెంకట నాగసాయి మనస్వి అనే విద్యార్థిని 600 మార్కులకు గాను 599 మార్కులుతో రికార్డు సృష్టించింది. సెకండ్ లాంగ్వేజ్ తప్ప అన్ని సబ్జెక్ట్స్ లో 100 కు 100 మార్కులు వచ్చాయి.
- పరీక్షకు హాజరైన విద్యార్థులు 6.16 లక్షలు
- ఉత్తీర్ణులైన విద్యార్థులు – 86.69 శాతం
- బాలికల ఉత్తీర్ణత శాతం 89.17
- బాలురు ఉత్తీర్ణత శాతం – 84.32 శాతం
- ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచిన
- పార్వతీపురం మన్యం జిల్లా
టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 3 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ కమిషనర్ సురేశ్ వెల్లడించారు. రేపటి నుంచి ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్లు స్వీకరిస్తామని, విద్యార్థులు స్కూల్ నుంచి మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. నాలుగు రోజుల్లో షార్ట్ మెమోలు కూడా విడుదల చేస్తామన్నారు.
ఫలితాలను పాఠశాల విద్యా శాఖ అధికారిక వెబ్సైట్ లో హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు సరిగ్గా నమోదు చేసి విద్యార్థులు తెలుసుకోవచ్చు.
క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్లో వెంటనే మీరు ఫలితాలను చెక్ చేయవచ్చు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..