ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి వివిధ ముఖ్యమైన అప్డేట్స్ వచ్చాయి… ఏపీపీఎస్సీ గ్రూప్-1 , గ్రూప్-2 మరియు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ ఈ ఆర్టికల్ లో చూడండి.
ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఫలితాలు ఈ వారంలోనే విడుదల కాబోతున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు శనివారంలోగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు, నిరుద్యోగ సంఘాలు ఏపీపీఎస్సీ మరియు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అనేక కారణాల వలన ప్రిలిమ్స్ పరీక్ష సరిగ్గా రాయలేకపోయామని అభ్యర్థులు ఏపీపీఎస్సీకి తెలుపుతున్నారు. ఇందులో ముఖ్యంగా నోటిఫికేషన్ జారీకి , ప్రిలిమ్స్ మధ్య ఉన్న తక్కువ సమయం సన్నద్ధతకు సరిపోకపోవడం, ప్రశ్నపత్రం కఠినంగా ఉండడం, ‘భారతీయ సమాజం’ సిలబస్ కు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో ఆలస్యంగా రావడం వంటి కారణాలతో ఇబ్బంది పడ్డామని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇటువంటి కారణాల వలన ఒక్కోపోస్టుకు 50 మంది చొప్పున కాకుండా 100 మంది చొప్పున మెయిన్స్ కి ఎంపిక చేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించాలని ఏపీపీఎస్సీ కార్యాలయానికి అభ్యర్థనలు వస్తున్నాయి. దీనిపై కమీషన్ కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఏపీపీఎస్సీ సభ్యుడైన పరిగె సుధీర్ గారు కూడా దీనిపై ఇప్పటికే ట్విట్టర్ లో సమాచారం ఇచ్చారు. కాబట్టి ఒక్కో పోస్ట్ కు 100 మందిని చొప్పున మెన్స్ కు ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రిలిమ్స్ ఫలితాల విడుదల చేసే సమయానికి దీనిపై అధికారిక నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు.
APPSC గ్రూప్ 2 కోర్స్ ఇప్పుడు కేవలం – 399/- రూపాయలకే..
APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పూర్తి కోర్సు – 499/- రూపాయలకే
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
🔥 APPSC Group-1 అప్డేట్
మరోవైపు ఇటీవల జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ద్వారా కూడా ప్రధాన పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రశ్నపత్రంలో ఆంగ్లంనుంచి తెలుగు అనువాదంలో తప్పులు దొర్లడం, సన్నద్ధతకు తగిన సమయం లేకపోవడం వంటి కారణాల దృష్ట్యా ప్రధాన పరీక్షను ఎక్కువ మంది రాసేందుకు అవకాశాన్ని కల్పించాలని అభ్యర్థిస్తున్నారు.
ఫిబ్రవరి 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను ఏపీపీఎస్సీ విజయవంతంగా నిర్వహించింది. ప్రశ్న పత్రం కఠినంగా రావడం వలన అభ్యర్థులు ఆశించిన స్థాయిలో పరీక్ష రాయలేకపోయారు. ఏపీపీఎస్సీ ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ కు ఎంపిక చేస్తామని పరీక్షకు ముందే వెల్లడించింది. కానీ ప్రశ్నాపత్రం కఠినంగా రావడం వలన ఒక్క పోస్టుకు 100 మంది చొప్పున ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి ఎంపిక చేయాలని పరీక్ష రాసిన అభ్యర్థులు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు.
దీనిపై ఏపీపీఎస్సీ కూడా నిర్ణయం తీసుకుని ఒక పోస్ట్ కు వందమంది చెప్పిన ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు ఎంపిక చేయబోతున్నట్లు గతంలో పరిగే సుధీర్ గారు తెలిపారు.
ఫిబ్రవరి 25వ తేదీన జరిగిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ చాలా కష్టంగా రావడం వలన అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని పరీక్ష రాసిన అభ్యర్థులు, నిరుద్యోగ సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ సభ్యుడైన పరిగే సుధీర్ గారు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయబోతున్నట్లుగా తెలిపారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.
1:100 నిష్పత్తిలో ఎంపిక చేస్తే కట్ ఆఫ్ మార్కులు భారీగా తగ్గే కూడా అవకాశం ఉంది. అందువలన గ్రూప్ 2 మెయిన్స్ కు ఎక్కువ మంది అర్హులవుతారు. గత సంవత్సరం 897 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైన విషయం మీ అందరికీ తెలిసిందే.
మరోపక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2023 లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు 14/2023 నెంబర్ గల నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024లో ఏప్రిల్ 13వ తేదీన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించడం కూడా జరిగింది.
అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు మరియు డీఎస్సీ పరీక్షలు కారణంగా అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు మే 25వ తేదీన పరీక్ష నిర్వహించబోతున్నట్టుగా ప్రకటన జారీ చేశారు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
📌 Join Our What’s App Channel