ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ ఫలితాలు మరియు డీఎస్సీ పరీక్ష వాయిదా పడ్డాయి.
ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
దీంతోపాటు ఇప్పటికే పూర్తయినా టెట్ పరీక్షలు ఫలితాలను కూడా వెల్లడించవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. టెట్ ఫలితాలు మరియు డీఎస్సీ వాయిదాపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొంతమంది ఫిర్యాదు చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక లేఖ రాశారు.
దీంతో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు టెట్ డీఎస్సీ పరీక్షలను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత హైకోర్టు తీర్పు ఆధారంగా రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
కేంద్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు మేరకు టెట్ ఫలితాలు మరియు డీఎస్సీ పరీక్షలు నిర్వహణను తాత్కారికంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. కొత్త తేదీలతో షెడ్యూల్ ను తర్వాత ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
గతంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 30 మధ్య డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని షెడ్యూల్ విడుదల చేశారు. అయితే ఈలోపు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో టెట్ ఫలితాలు మరియు డీఎస్సీ పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.