Headlines

APPSC Group 2 Prelims Results 2023 | APPSC Group 2 Prelims Cut off Marks | APPSC Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను మరికొద్ది రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు ఏపీపీఎస్సీ సభ్యుడైన పరిగే సుధీర్ గారు తన ఎక్స్ ఖాతా ద్వారా (ట్విట్టర్) తెలిపారు .

ఫిబ్రవరి 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను ఏపీపీఎస్సీ విజయవంతంగా నిర్వహించింది. ప్రశ్న పత్రం కఠినంగా రావడం వలన అభ్యర్థులు ఆశించిన స్థాయిలో పరీక్ష రాయలేకపోయారు. ఏపీపీఎస్సీ ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ కు ఎంపిక చేస్తామని పరీక్షకు ముందే వెల్లడించింది. కానీ ప్రశ్నాపత్రం కఠినంగా రావడం వలన ఒక్క పోస్టుకు 100 మంది చొప్పున ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి ఎంపిక చేయాలని పరీక్ష రాసిన అభ్యర్థులు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు.

దీనిపై ఏపీపీఎస్సీ కూడా నిర్ణయం తీసుకుని ఒక పోస్ట్ కు వందమంది చెప్పిన ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు ఎంపిక చేయబోతున్నట్లు గతంలో పరిగే సుధీర్ గారు తెలిపారు.

ఫిబ్రవరి 25వ తేదీన జరిగిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ చాలా కష్టంగా రావడం వలన అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని పరీక్ష రాసిన అభ్యర్థులు, నిరుద్యోగ సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. 

ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ సభ్యుడైన పరిగే సుధీర్ గారు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయబోతున్నట్లుగా తెలిపారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.

1:100 నిష్పత్తిలో ఎంపిక చేస్తే కట్ ఆఫ్ మార్కులు భారీగా తగ్గే కూడా అవకాశం ఉంది. అందువలన గ్రూప్ 2 మెయిన్స్ కు ఎక్కువ మంది అర్హులవుతారు. గత సంవత్సరం 897 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైన విషయం మీ అందరికీ తెలిసిందే. 

మరోపక్క ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2023 లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు 14/2023 నెంబర్ గల నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024లో ఏప్రిల్ 13వ తేదీన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించడం కూడా జరిగింది.

అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు మరియు డీఎస్సీ పరీక్షలు కారణంగా అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు మే 25వ తేదీన పరీక్ష నిర్వహించబోతున్నట్టుగా ప్రకటన జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!