ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ మరియు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత టెట్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించారు. కానీ షెడ్యూల్ ప్రకారం టెట్ ఫలితాలు విడుదల చేయలేదు. డీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా జరగలేదు.
ఈ నేపథ్యంలో టెట్ పరీక్ష రాసి ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక గందరగోళానికి గురవుతున్నారు..
టెట్ ఫలితాలు విడుదల చేయకముందే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.
✅ APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-
✅ APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చాకే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను విడుదల చేస్తామని తెలియజేస్తూ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో ఒక ప్రకటన ఉంచింది.
మరోపక్క డీఎస్సీపైనా స్పష్టత లేకుండా పోయింది. ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు ఐచ్ఛికాల నమోదు మరియు హాల్ టికెట్స్ ను 25 నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది.
మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలి. కానీ, విద్యాశాఖ ఇంతవరకు పరీక్ష కేంద్రాల ఎంపికకే అవకాశం ఇవ్వలేదు. టెట్ ఫలి
తాలు, డీఎస్సీ నిర్వహణపై ఎన్నికల సంఘం నిర్ణయం కోసం విద్యాశాఖ ఎదురుచూస్తోంది.
దీంతో అసలు డీఎస్సీ ఉంటుందా? వాయిదా పడుతుందో తెలియక అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారు.