Headlines

ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP District Court Jobs Recruitment 2024 | AP Outsourcing Jobs Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్ట్ నుండి పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.

నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు త్వరగా అప్లై చేయండి .

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 12వ తేదీ లోపు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి. 

ఈ ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ నోటిఫికేషన్ ద్వారా కృష్ణా జిల్లాలో జిల్లా కోర్టులో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేయవచ్చు .

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 06

🔥 పోస్టుల పేర్లు : పర్సనల్ అసిస్టెంట్ 

🔥 అర్హతలు : పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయాలంటే నిరుద్యోగ అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి , దానితోపాటు ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఎగ్జామినేషన్స్ నుండి ఇంగ్లీషు టైప్ రైటింగ్ లో హయ్యర్ గ్రేడ్ నందు మరియు షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ నందు ఉత్తీర్ణత కలిగిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి.( షార్ట్ హ్యాండ్ లో హయ్యర్ గ్రేడ్ నందు ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు లేకపోతే లోవర్ గ్రేడ్ నందు ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు .)  దీంతోపాటు కంప్యూటర్ ఆపరేషన్స్ కు సంబంధించిన నైపుణ్యం కలిగి ఉండాలి .

🔥 జీతం : 18,500/-

🔥 వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకు 01-07-2024 నాటికి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 

అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ , ఎస్టీ , బిసి అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు. అభినందన అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్ధులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు. 

🔥 చివరి తేదీ : ఏప్రిల్ 12

ఈ పోస్టుకు అప్లై చేసే అభ్యర్థులు ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు సంబంధిత కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాలి .

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఈ పోస్టులకు అప్లై చేయు అభ్యర్థులు దిగువ తెలిపిన సర్టిఫికెట్ల పైన అట్టేస్టేషన్ చేయించి అప్లికేషన్ కు జతపరిచి సంబంధిత కార్యాలయంలో అప్లికేషన్ కు అందజేయాలి.

🔥 కావాల్సిన సర్టిఫికెట్స్ : 

  1. అకాడమిక్ , టెక్నికల్ మరియు అభ్యర్థికి సంబంధించిన ఇతర స్కిల్స్ ని తెలిపే సర్టిఫికెట్స్
  2. పుట్టిన తేదీని ధ్రువీకరించే సర్టిఫికెట్
  3. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కమ్యూనిటీ సర్టిఫికెట్
  4. ఇతర సంబంధిత సర్టిఫికెట్స్
  5. గెజిటెడ్ అధికారి చేత అభ్యర్థి యొక్క లేటెస్ట్ ఫోటోగ్రాప్ పైన అట్టేస్టేషన్ చేయించి ఆ ఫోటోను అప్లికేషన్ లో ఫోటో అంటించాల్సిన ప్రదేశంలో అంటించాలి.

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ , కృష్ణ, మచిలీపట్నం.

పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

✅ APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-

APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/- 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!