ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులకు శుభవార్త. గ్రూప్ 2 ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం.
ఫిబ్రవరి 25వ తేదీన జరిగిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ చాలా కష్టంగా రావడం వలన అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని పరీక్ష రాసిన అభ్యర్థులు, నిరుద్యోగ సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ సభ్యుడైన పరిగే సుధీర్ గారు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయడానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వారంలో వెల్లడిస్తామని తెలిపారు.
1:100 నిష్పత్తిలో ఎంపిక చేస్తే కట్ ఆఫ్ మార్కులు భారీగా తగ్గే కూడా అవకాశం ఉంది. అందువలన గ్రూప్ 2 మెయిన్స్ కు ఎక్కువ మంది అర్హులవుతారు. గత సంవత్సరం 897 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైన విషయం మీ అందరికీ తెలిసిందే.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే, బ్యాంక్స్, SSC, గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఫుల్ కోర్స్ – 399/- Only
ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫుల్ కోర్స్ – 499/- Only
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
అదేవిధంగా పరిగె సుదీర్ గారు తన ట్విట్టర్ ఖాతా ద్వారా గత సంవత్సరం విడుదల చేసిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్ష కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వాస్తవానికి ఏప్రిల్ 13వ తేదీన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ గతంలోనే వెల్లడించింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం కారణంగా ఈ పరీక్షను వాయిదా వేస్తామని ఆయన తెలిపారు. మళ్లీ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనేది తర్వాత వెల్లడిస్తామని తెలియజేశారు.