దేశవ్యాప్తంగా ఉన్న ESIC ల్లో నర్సింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1930 నర్సింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకుని అవకాశం ఉంది.
ఈ పోస్టులకు మార్చి 7వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేసుకున్న అభ్యర్థులకు పెన్ మరియు పేపర్ విధానంలో జూలై 7వ తేదీన పరీక్ష నిర్వహించబోతున్నట్లు నోటిఫికేషన్ లో ముందుగానే పరీక్ష తేదీన ప్రకటించడం జరిగింది.
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ఉన్న 80 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయిస్తామని నోటిఫికేషన్ లో తెలిపారు.
✅ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల ప్రిపరేషన్ కోసం మన యాప్ లో క్లాసులు మరియు టెస్ట్ సిరీస్ లు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి.
🔥 అర్హతలు :
- బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి నర్స్ లేదా మిడ్ వైఫ్ నర్స్ గా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అవ్వాలి. (లేదా)
- జిఎన్ఎమ్ పూర్తి చేసి నర్స్ లేదా మిడ్ వైఫ్ నర్స్ గా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి కనీసం 50 పడకల హాస్పిటల్ లో ఒక సంవత్సరం అనుభవం కలిగిన వారు అర్హులు.
🔥 మొత్తం ఖాళీలు : 1930
🔥 వయస్సు : 27-03-2024 నాటికి
UR/ EWS అభ్యర్థులకు 18 నుండి 30 సంవత్సరాలు
OBC అభ్యర్థులకు 18 నుండి 33 సంవత్సరాలు
SC, ST అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాలు
దివ్యాంగులకు 18 నుండి 40 సంవత్సరాలు
🔥 పరీక్ష కేంద్రాలు :
🔥 ఎంపిక విధానం :
రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు : మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ,దివ్యాంగులైన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.
మిగిలిన వారు 25 రూపాయలు ఫీజు చెల్లించాలి
🔥 7th CPC ప్రకారం లెవెల్ 7 క్రింద వేతనం చెల్లిస్తారు.
🔥 పరీక్ష తేదీ: 07-07-2024
🔥 అప్లై విధానం : ఆన్లైన్
🔥 సిలబస్ :
🔥 ఈ పోస్టులకు ఎంపికైన వారికి రెండేళ్ల ప్రొబిషన్ కాలం ఉంటుంది. దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ESIC లు ఉన్నాయి.