ఏపీపీఎస్సీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ గణాంకాల శాఖలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 18వ తేదీ నుండి మే 8వ తేదీ మధ్య ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ విధానములో అప్లై చేయాలి.
ఈ పోస్టులకు అప్లై చెయాలి అనుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా ఏపీపీఎస్సీ యెక్క అధికారిక వెబ్సైట్ లో OTPR రిజిస్ట్రేషన్ / లాగిన్ అవ్వడం ద్వారా అప్లై చేయాలి.
ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము .
APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-
APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/-
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
🔥 పోస్టుల పేర్లు : అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 05
🔥 విద్యార్హత : 👇
🔥 జీతము : 37,640/- నుండి 1,15,500/-
🔥 ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.
🔥 అప్లై విధానం : APPSC అధికారిక వెబ్సైట్ లో
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 18-04-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 08-05-2024
🔥 అప్లై విధానము: ఏపీపీఎస్సీ ఆఫిసియల్ వెబ్సైట్ లో అప్లై చేయాలి.
🔥 పరీక్ష తేదీ : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.
🔥 హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేది : అధికారిక వెబ్సైట్ లో తరువాత వెల్లడిస్తారు.
🔥 వయస్సు : 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు (01-07-2024 నాటికి)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు.
🔥 ఫీజు : జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ప్రొసెసింగ్ ఫీజు 250/- మరియు పరీక్ష ఫీజు 120/-
ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 250/- (వీరికి పరీక్ష ఫీజు అయిన 120/- నుండి మినహాయింపు ఇచ్చారు)
🔥 ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు 2 పేపర్స్ తో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతీ పేపర్ 150 మార్కులకు నిర్వహిస్తారు.
2 పేపర్స్ కలిపి మొత్తం 300 మార్కులకు ఇస్తారు.
పేపర్-1 లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుండి 150 ప్రశ్నలు 150 నిమిషాల తో 150 మార్కులకి ఇస్తారు.
పేపర్-2 లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుండి 150 ప్రశ్నలు 150 నిమిషాల తో 150 మార్కులకి ఇస్తారు.
ప్రతి తప్పు సమాధానానికి ⅓ వంతు రుణాత్మక మార్కుల విధానం అమలులో ఉంది.
🔥 కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ :
పరీక్షలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించిన కటాఫ్ మార్కులు వచ్చిన వారికి కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్ణయించిన క్వాలిఫై మార్క్స్ వస్తే సరిపోతుంది. ఫైనల్ సెలెక్షన్ లో ఈ పరీక్షలో వచ్చిన మార్కులు పరిగణలోకి తీసుకోరు.