తెలంగాణలో రాష్ట్రంలో ఉపాద్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ విడుదల విడుదల చేశారు. సాధ్యమైనంత త్వరగా ఈ పోస్టులు భర్తీ చేపట్టాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.
మొత్తం 11,062 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ పోస్టులకు మార్చి 4వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష తేదీలు తరువాత వెల్లడిస్తారు.
మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేయగా ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 ఉన్నాయి. వీటితో పాటు 727 భాషా పండితులు , 180 పిఈటి, 6,508 ఎస్జీటీ, ప్రత్యేక కేటగిరీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220, ఎస్జీటీ 796 ఉన్నాయి.
🔥 ఫీజు : 1000/-
🔥 వయస్సు : 2023 జూలై 1 నాటికి 18 సంవత్సరాలు నుండి 46 సంవత్సరాలు మద్య వయస్సు ఉండాలి.
🔥 వయస్సు సడలింపు : SC, ST, BC, EWS అభ్యర్థులకు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాల వయో సడలింపు కలదు.
మాజీ సైనికులకు 3 సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥 గత DSC నోటిఫికేషన్ రద్దు చేసి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు, కాబట్టి గతంలో ఈ పోస్టులకు అప్లై చేసిన వారు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
🔥 పరీక్ష కేంద్రాలు : పోస్టుల ఎంపిక లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు.
మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరబాద్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సంగారెడ్డి, నల్గొండ జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
అభ్యర్థులు పోస్టులకు అప్లై చేసేటప్పుడు పరీక్ష కేంద్రాల జిల్లాలను ప్రాధాన్యత క్రమములోతెంచుకోవచ్చు.