Headlines

తెలంగాణలో భారీగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు | Telangana NHM Jobs Recruitment 2024 | Telangana Contract / Outsourcing Basis Jobs 2024

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసే పోస్టుల నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూసే వారికి ఇదే మంచి అవకాశం. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ ప్రతి జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఇప్పటికే దాదాపు ప్రతి జిల్లాలో కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించడం కూడా జరిగింది. కొన్ని జిల్లాల్లో ఈ పోస్టులకు అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది . మరికొన్ని జిల్లాల్లో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.

ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలి.

ఈ నోటిఫికేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల వారీగా విడుదవుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన అన్ని నోటిఫికేషన్స్ క్రింద ఉన్న లింక్ ఉపయోగించి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.. క్రింద మీకు కనిపిస్తున్న లింకుపై క్లిక్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల పేర్లు కనిపిస్తాయి.  మీరు ఏదైనా జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలి అంటే ఆ జిల్లా పేరుపై క్లిక్ చేసినట్లయితే జిల్లాకు చెందిన అధికారిక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి మీరు ఆ జిల్లాను తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అర్హత ఉంటే త్వరగా అప్లై చేసుకోండి.

ప్రతీ జిల్లాలో జిల్లా ఎంపిక కమిటీల ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల ఎంపిక లో రాత పరీక్ష లేదు. కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమె ఎంపిక చేస్తున్నారు.

తాజాగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో జిల్లా , జోనల్, మల్టీ జోనల్ స్థాయి పోస్టులు ఉన్నాయి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా 

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 64

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు 

🔥 పోస్టుల పేర్లు మరియు జీతాలు : 👇👇👇

🔥 అర్హతలు : అర్హతలకు సంబంధించిన వివరాలు నోటిఫికేషన్ చూసి తెలుసుకోండి.

 🔥 నోటిఫికేషన్ విడుదల తేదీ : 28-02-2023

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ: 28-02-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 11-03-2024

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు (01-07-2024 నాటికి)

🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు (01-07-2024 నాటికి)

🔥 వయస్సు సడలింపు : తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 ఫీజు: లేదు 

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : DMHO, అసిఫాబాద్ జిల్లా, IDOC, మొదటి అంతస్తు, F-25 బ్లాక్.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!