ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య,ఆరోగ్య శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక శుభవార్త..
జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగమైన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మరియు అర్బన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ (అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్) లో కాంట్రాక్టు పద్ధతిలో మెడికల్ ఆఫీసర్ మరియు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన స్థానిక అభ్యర్థులు మాత్రమే అర్హులు.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్
🔥 మొత్తం ఉద్యోగాలు : 189
- మెడికల్ ఆఫీసర్ – 102
- స్టాఫ్ నర్స్ – 87
ఈ పోస్టుల ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయో నోటిఫికేషన్ చూసి మీరు తెలుసుకోవచ్చు.
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): కాంట్రాక్ట్ జాబ్స్
🔥 పోస్టుల పేర్లు : మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్
🔥జీతము :
మెడికల్ ఆఫీసర్ – 61,960/-
స్టాఫ్ నర్స్ – 27,675/-
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ: 28-02-2024
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 10-03-2024
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
🔥 వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
అనగా ఎస్సీ ,ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు
🔥 ఫీజు :
- మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు
OC అభ్యర్థులకు -1000/-
SC, ST, BC, ఎక్స్ సర్వీస్ మెన్, PH అభ్యర్థులకు – 500/-
- స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు
OC అభ్యర్థులకు -600/-
SC, ST, BC, ఎక్స్ సర్వీస్ మెన్, PH అభ్యర్థులకు – 400/-
🔥 అప్లికేషన్ విధానం : ఆన్లైన్
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే ఆన్లైన్ లో అప్లికేషన్ నింపి అప్లై చేయాలి. అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.