తెలంగాణ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేశారు..
ఈ నోటిఫికేషన్స్ ద్వారా కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ ను నింపి అవసరమైన అన్ని సర్టిఫికెట్లు జతపరచి చివరి తేదీలోపు అప్లికేషన్ ను సంబంధిత కార్యాలయం లో అందజేయాలి.
ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్స్ ద్వారా జిల్లాల వారీగా స్టాఫ్ నర్స్ , ఫార్మసిస్ట్ , ల్యాబ్ టెక్నీషియన్, సపోర్టింగ్ స్టాఫ్ , మెడికల్ ఆఫీసర్ , MLHP మరియు ఇతర చాలా రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు.
జిల్లాల వారీగా ఖాళీల సంఖ్య మరియు అప్లై తేదీలు మాత్రమే మారుతాయి. అన్ని జిల్లాల్లో కూడా ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము వంటివి ఒకే విధంగా ఉన్నాయి.
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ అనేవి నిర్వహించారు. కేవలం మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అభ్యర్థులకు 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేయడానికి జిల్లాల వారీగా వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
మీరు ఏదైనా జిల్లా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలంటే ఆ జిల్లా పేరుపై క్లిక్ చేస్తే ఆ జిల్లాకు చెందిన అధికారిక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో ఉన్న నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి అర్హత, ఆసక్తి ఉంటే అప్లికేషన్ పూర్తి చేసి త్వరగా అప్లై చేసుకోండి.
ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా విడుదల చేసే ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలెక్షన్ లిస్ట్ అనేవి అదే జిల్లా వెబ్సైట్లో పెడతారు. కాబట్టి అభ్యర్థులు తరచు జిల్లా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి.
▶️ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
▶️ జనగామ జిల్లా
▶️ ఖమ్మం జిల్లా
▶️ మెదక్ జిల్లా