AIIMS NORCET-6 Notification in Telugu | AIIMS NORCET 6 Qualification, Age, Syllabus,Selection Process Details | AIIMS NORCET-6 Notification 2024

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎయిమ్స్ లలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

 

నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన పురుష మరియు మహిళా అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు. 

 

ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం NORCET పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసి నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు.

 

నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా NORCET-6 నోటిఫికేషన్ విడుదల చేశారు

 

ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ లలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు.

 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది .  ఆన్లైన్ లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మార్చి 17వ తేదీ లోపు అప్లై చేయాలి . 

 

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

 

NORCET నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తక్కువ ధరలో టెస్ట్ సిరీస్ కావాలంటే మన ” INB Jobs ” యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి

 

Download ”  INB Jobs ” APP

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఎయిమ్స్ , న్యూ ఢిల్లీ

 

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : నోటిఫికేషన్ లో తెలియజేయలేదు . తర్వాత నోటిఫై చేస్తారు

 

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు

 

అర్హతలు : 

 

  1. బిఎస్సి నర్సింగ్ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు . స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి ( లేదా )
  2. GNM పూర్తి చేసి కనీసం 50 బెడ్లు గల హాస్పిటల్లో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి . స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి

 

✅ ముఖ్యమైన తేదీలు : 

 

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 26-02-2024

 

అప్లై చేయడానికి చివరి తేదీ : 17-03-2024

 

అప్లికేషన్ కరెక్షన్ తేదీలు: మార్చి 18 నుండి 20 మద్య 

 

ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : 14-04-2024

 

మెయిన్స్ పరీక్ష తేదీ : 05-05-2024

 

కనీస వయస్సు : 18 సంవత్సరాలు (05-05-2024 నాటికి ) 

 

గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు (05-05-2024 నాటికి ) 

 

వయస్సు సడలింపు :  ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

 

పరీక్ష విధానం : ప్రిలిమ్స్ లో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను వంద మార్కులకు గాను ఇస్తారు. ఇందులో 20 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ మరియు ఆటిట్యూడ్ నుంచి , 80 ప్రశ్నలు నర్సింగ్ సిలబస్ నుండి ఇస్తారు .

 

ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయితే చాలు ఇందులో వచ్చిన మార్కులు ఎంపిక ప్రక్రియలో పరిగణలోకి తీసుకోరు .

 

మెయిన్స్ లో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను వంద మార్కులకు గాను ఇస్తారు. ఈ 100 ప్రశ్నలు నర్సింగ్ సిలబస్ నుంచి వస్తాయి. మెయిన్స్ లో అన్ని ప్రశ్నలు నర్సింగ్ సిలబస్ నుంచి మాత్రమే వస్తాయి.

 

మెయిన్స్ లో వచ్చిన మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఫైనల్ సెలక్షన్ లిస్ట్ తయారు చేస్తారు .

 

ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ లో 1/3 నెగటివ్ మార్కింగ్ విధానం ఉంది .

 

ఫీజు : 

 

  • 2,400/- రూపాయలు ( ఎస్సీ , ఎస్టీ, EWS అభ్యర్థులకు )

 

  • 3000/- రూపాయలు ( జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు )

 

  • దివ్యాంగులైన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు .

 

  • పరీక్ష రాసిన ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థుల ఫీజును పరీక్ష ఫలితాలు విడుదల చేసిన తర్వాత రిఫండ్ చేయడం జరుగుతుంది

 

అప్లికేషన్ విధానం : AIIMS న్యూ ఢిల్లీ అధికారిక వెబ్సైట్లో అప్లై చేయాలి .

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

 

Apply Online 

 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

 

YouTube Channel – Click here

 

Instragram Link – Click here 

 

Telegram Group – Click here

 

Our APP – Click here 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!