ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రశ్నాపత్రం కఠినంగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రశ్నలు నిడివితో సమయం సరిపోలేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. జతపరిచే ప్రశ్నలు ఎక్కువగా ఉండడంతో సమాధానాలు గుర్తించేందుకు అభ్యర్థులకు ఎక్కువ సమయం పట్టింది.
ప్రశ్నలు సరళి కఠినంగా ఉండడం వలన కటఆఫ్ “ 50 నుండి 60 “ మధ్య ఉండవచ్చని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.
APPSC Group 2 సిలబస్ ప్రకారం పూర్తి క్లాస్ లు , Pdf మెటీరియల్స్, ప్రాక్టిస్ టెస్ట్స్ మొత్తం – 399/-
APPSC Forest Beat Officer కోర్స్ – 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
మొత్తం 899 పోస్టులకు గాను 4,83,525 మంది అప్లై చేసుకుంటే, వారిలో 4,,63,517 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థుల్లో 4,04,037 మంది (87.17%) అభ్యర్థులు హాజరయ్యారు.
పరీక్షకు హాజరైన అభ్యర్థులకు సంబంధించి మరియు ప్రిలిమ్స్ ఫలితాలు మెయిన్స్ పరీక్షలు నిర్వహణపై ఏపీపీఎస్సీ తాజాగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. దీని ప్రకారం గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను 5 నుంచి 8 వారాల్లో విడుదల చేస్తామని తెలిపింది.
అలాగే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను జూన్ లేదా జూలై నెలలో నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు పరిగె సుధీర్ గారు తన ఎక్స్ ఖాతాలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షకు 87.17% మంది అభ్యర్థులు హాజరయ్యారని, ఏపీపీఎస్సీ నిర్వహించిన గత పరీక్షలతో పోలిస్తే ఈసారి అభ్యర్థుల హాజరు శాతం గణనీయంగా పెరిగిందని తెలిపారు.
అంతేకాకుండా పోస్టుల సంఖ్యను 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ కి ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఎంపికలో జనరల్ కట్ ఆఫ్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.