ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ రోడ్లు మరియు భవనాల శాఖ నుండి ప్రతి జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిలో లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ జిల్లా కలెక్టర్ల ద్వారా నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు.
కొన్ని జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ యొక్క లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
✅ అన్ని జిల్లాల Website Links – Click here
పశ్చిమ గోదావరి జిల్లా నోటిఫికేషన్
AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పూర్తి కోర్స్ – 499/-
తాజాగా విశాఖపట్నం జిల్లాలో వాచ్మెన్, ఆఫీస్ సభార్డినేట్, శానిటరీ వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 23 నుండి ఫిబ్రవరి 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రహదారులు మరియు భవనాలు సర్కిల్ ఆఫీస్ వారి కార్యాలయం, విశాఖపట్నం జిల్లా
పోస్టుల పేర్లు: ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, శానిటరీ వర్కర్
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 23-02-2024
అప్లికేషన్ చివరి తేదీ : 29-02-2024
ప్రోవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 02-03-2024
సెలెక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 06-03-2024
సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీ: 07-03-2024
అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ: 07-03-2024
మొత్తం పోస్టులు : 06
ఆఫీస్ సబార్డినేట్ – 03
వాచ్ మెన్ – 01
శానిటరీ వర్కర్ – 02
జీతము :
అన్ని ఉద్యోగాలకు జీతము ఒకే విధంగా ఉంటుంది.
వాచ్ మెన్ – 15,000/-
శానిటరీ వర్కర్ – 15,000/-
ఆఫీస్ సబార్డినేట్ – 15,000/-
విద్యార్హత :
- ఆఫీస్ సబార్డినేట్ మరియు వాచ్ మెన్ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత ఉండాలి. ఈ రెండు రకాల పోస్టులకు అనుభవం ఉంటే అదనంగా మార్కులు కలుపుతారు. కాబట్టి అర్హులైన అభ్యర్థులు అనుభవ ధ్రువీకరణ పత్రము ఉంటే దానిని కూడా అప్లికేషన్ కు జతపరచాలి.
- శానిటరీ వర్కర్ ఉద్యోగాలకు విద్యార్హత లేకపోయినా పని అనుభవం ఉంటే అప్లై చేసుకోవచ్చు.
- వాచ్ మెన్ మరియు సానిటరీ వర్కర్ ఉద్యోగాలకు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పకుండా కలిగి ఉండాలి.
ఫీజు : లేదు
వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. (01-07-2023 నాటికి)
వయో సడలింపు:
SC, ST, BC, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా విద్యార్హత ధ్రువపత్రాలు, 4వ తరగతి నుండి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రము, EWS అభ్యర్థులు అయితే EWS సర్టిఫికెట్, దివ్యాంగులైన అభ్యర్థులు అయితే సదరం సర్టిఫికెట్, అనుభవం ఉన్న వారు ఆయితే అనుభవ ధ్రువీకరణ పత్రాలు మరియు ఇతర సర్టిఫికెట్లు వంటి వాటిపై సెల్ఫ్ అటేస్టేషన్ చేసి అప్లికేషన్ కు జతపరిచి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.
ఎంపిక విధానం : మెరిట్ / ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ అందజేయాల్సిన / పంపవలసిన చిరునామా : సూపరింటెండింగ్ ఇంజనీర్, (R&B) సర్కిల్, సీతమ్మధార, విశాఖపట్నం.
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి.
✅ అన్ని జిల్లాల Website Links – Click here