ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
రాష్ట్రవ్యాప్తంగా 1327 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,63,000 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు వెల్లడించారు.
ప్రిలిమ్స్ ఫలితాలను జూన్ లేదా జూలై నెలలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 17వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుందని వాయిదా పై వచ్చే వదంతులు నమ్మవద్దని తెలిపారు.
మొత్తం 897 పోస్టులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన 4,83,525అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకున్నారు. ఈ పోస్టులకు మరో రెండు పోస్టులు తర్వాత కలిపారు. ఒక్కో పోస్టుకు దాదాపు 537 మంది పోటీ పడుతున్నారు
APPSC Forest Beat Officer కోర్స్ – 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
మెయిన్స్ పరీక్ష – తాజా సమాచారం:
ఏపీపీఎస్సీ సభ్యుడైన పరీగే సుధీర్ గారిని ‘X’ (Twitter) లో మెయిన్స్ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు అని అడగగా దానికి నాలుగు నెలల సమయం పడుతుందని ఆయన రిప్లై ఇచ్చారు.
ప్రిలిమ్స్ పరీక్ష పూర్తయిన తర్వాత ప్రాథమిక “కి” ఏపీపీఎస్సీ సాధ్యమైనంత త్వరగా విడుదల చేసి దానిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తుంది. తరువాత తుది “కి“ వెల్లడిస్తుంది.
క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష పత్రాలు మరియు ‘ Key ‘ డౌన్లోడ్ చేసుకోండి.
గమనిక: ఏపీపీఎస్సీ విడుదల చేసే ప్రాథమిక ‘ కీ ‘నే అభ్యర్థులు ఫైనల్ గా భావించాలి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుంటున్న “ కీ “ కేవలం అభ్యర్థుల రిఫరెన్స్ కోసం మాత్రమే.