Headlines

జిల్లా కలెక్టర్ జారీ చేసిన నోటిఫికేషన్ | Srikakulam District R&B Department Contract Basis Jobs Recruitment 2024 | AP Office Subordinate, Watch men, Sanitary Worker Jobs Notification 2024

మీరు మీ సొంత జిల్లాలో కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రోడ్లు మరియు భవనాల శాఖ నుండి జిల్లాల వారీగా కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వాచ్ మెన్ ,ఆఫీస్ సబార్డినేట్ మరియు శానిటరీ వర్కర్ ( సఫాయి కర్మాచారి ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి.

 

ఇప్పటివరకు విడుదలైన ప్రతి నోటిఫికేషన్ వివరాలు మన వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తూ ఉన్నాము. ఇప్పటివరకు విడుదలైన అన్ని నోటిఫికేషన్స్ క్రింది ఇచ్చిన జిల్లాల వారి నోటిఫికేషన్స్ లింక్స్ ఉపయోగించి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని జిల్లాల్లో ఒకే రకమైన ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అన్ని జిల్లాలో అర్హతలు మరియు ఎంపిక విధానం ఒకే విధంగా ఉంటాయి. జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య మరియు అప్లై తేదీలు మాత్రమే మారుతాయి.

 

ఏలూరు జిల్లా నోటిఫికేషన్ 

 

కడప జిల్లా నోటిఫికేషన్

 

అనంతపురం నోటిఫికేషన్

 

నెల్లూరు నోటిఫికేషన్

 

చిత్తూరు జిల్లా నోటిఫికేషన్

 

విజయనగరం జిల్లా నోటిఫికేషన్

 

పల్నాడు జిల్లా నోటిఫికేషన్ 

 

ప్రకాశం జిల్లా నోటిఫికేషన్

 

గుంటూరు జిల్లా నోటిఫికేషన్

 

ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్ మరియు శానిటరీ వర్కర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తుల కోరుతూ తాజాగా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఔట్ సోర్సింగ్ విధానము లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు నోటిఫికేషన్ విడుదల చేశారు.

 

పేద నిరుద్యోగులు కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీ తో అతి తక్కువ ధరలో ఆన్లైన్ క్లాసెస్..

 

✅ APPSC గ్రూప్ 2 పూర్తి కోర్సు – 399/- మాత్రమే.

 

AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పూర్తి కోర్స్ – 499/-

 

మా యాప్ లో మీరు తీసుకునే కోర్స్ ల్లో సిలబస్ ప్రకారం క్లాసులతోపాటు PDF మెటీరియల్స్ మరియు ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది.

 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : రహదారులు మరియు భవనాలు సర్కిల్ ఆఫీస్ వారి కార్యాలయం, శ్రీకాకుళం జిల్లా

 

పోస్టుల పేర్లు: ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్, శానిటరీ వర్కర్

 

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 22-02-2024

 

అప్లికేషన్ చివరి తేదీ : 04-03-2024

 

ప్రోవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 07-03-2024

 

సెలెక్షన్ లిస్ట్ విడుదల తేదీ : 13-03-2024

 

సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీ: 14-03-2024

 

అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ: 14-03-2024

 

మొత్తం పోస్టులు : 14

 

ఆఫీస్ సబార్డినేట్ – 05

 

వాచ్ మెన్ – 04

 

శానిటరీ వర్కర్ – 05

 

జీతము : అన్ని ఉద్యోగాలకు జీతము ఒకే విధంగా ఉంటుంది.

 

ఆఫీస్ సబార్డినేట్ – 15,000/-

 

వాచ్ మెన్ – 15,000/-

 

శానిటరీ వర్కర్ – 15,000/-

 

విద్యార్హత

 

ఆఫీస్ సబార్డినేట్ మరియు వాచ్ మెన్ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత ఉండాలి. ఈ రెండు రకాల పోస్టులకు అనుభవం ఉంటే అదనంగా మార్కులు కలుపుతారు.

 

శానిటరీ వర్కర్ ఉద్యోగాలకు విద్యార్హత లేకపోయినా పని అనుభవం ఉంటే అప్లై చేసుకోవచ్చు.

 

వాచ్ మెన్ మరియు సానిటరీ వర్కర్ ఉద్యోగాలకు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

 

ఫీజు :  లేదు

 

వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. (01-07-2023 నాటికి)

 

వయో సడలింపు: 

 

SC, ST, BC, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

 

విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

 

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్

 

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా విద్యార్హత ధ్రువపత్రాలు, 4వ తరగతి నుండి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రము, EWS అభ్యర్థులు అయితే EWS సర్టిఫికెట్, దివ్యాంగులైన అభ్యర్థులు అయితే సదరం సర్టిఫికెట్, అనుభవం ఉన్న వారు ఆయితే అనుభవ ధ్రువీకరణ పత్రాలు మరియు ఇతర సర్టిఫికెట్లు వంటి వాటిపై సెల్ఫ్ అటిస్టేషన్ చేసి అప్లికేషన్ కు జతపరిచి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.

 

ఎంపిక విధానం : మెరిట్ / ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

అప్లికేషన్ అందజేయాల్సిన / పంపవలసిన చిరునామా : ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండింగ్ ఇంజనీర్ (R&B) సర్కిల్ ఆఫీస్, శ్రీకాకుళం, సాయిబుల తోట, శ్రీకాకుళం, శ్రీకాకుళం జిల్లా.

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి. 

 

ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. 

 

✅ Download Notification 

 

Official Website 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!