ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నుండి కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని అర్హత ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు త్వరగా అప్లై చేసుకోండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ )
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి
ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరీ జిల్లాలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను కోరుతున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 24వ తేదీ లోపు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అప్లై చేసే ప్రతి పోస్టుకు వేరువేరుగా అప్లికేషన్ పెట్టాలి.
భర్తీ చేసే పోస్టులు : ART మెడికల్ ఆఫీసర్, ART స్టాఫ్ నర్స్
మొత్తం ఖాళీలు: 07
ART మెడికల్ ఆఫీసర్ – 05
ART స్టాఫ్ నర్స్ – 02
అర్హతలు :
ఈ పోస్టులకు అర్హతలు క్రింది విధముగా ఉండాలి
ఈ పోస్టుకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అర్హులవుతారు ( 31-01-2024 నాటికి). అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు వయసులో వయో సడలింపు ఇస్తారు. అనగా ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
ఈ పోస్టులకు రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది..
ఫీజు : ఓసి అభ్యర్థులు 250/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ మరియు దివ్యాంగులైన అభ్యర్థులుకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సెలక్ట్ అయ్యే అభ్యర్థులకు జీతము క్రింది విధంగా ఉంటుంది.
ART మెడికల్ ఆఫీసర్ – 72,000/-
ART స్టాఫ్ నర్స్ – 21,000/-
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అప్లై చేయాలి.
అడ్రస్: డిస్ట్రిక్ట్ లెప్రసీ , AIDS & TB ఆఫీస్, 2nd ఫ్లోర్, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, కాకినాడ జిల్లా, కాకినాడ