తెలంగాణ రాష్ట్రంలో 18 ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
2022లో ఏప్రిల్ 6వ తేదీన 503 పోస్టులతో విడుదలైన గ్రూప్ 1 పోస్టుల నోటిఫికేషన్ రద్దుచేసి తాజాగా 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలను తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కూడా కేటాయించడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసే సమయంలో 10 జిల్లాలను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవచ్చు.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 23 నుండి మార్చి 14వ తేదీ వరకు ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ పెట్టే సమయంలో అభ్యర్థులు ఏమైనా పొరపాట్లు చేస్తే మార్చి 23వ తేదీ నుండి మార్చి 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ లో సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇస్తారు.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ సంవత్సరం మే లేదా జూన్ నెలలో మెయిన్స్ పరీక్షను ఈ సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో నిర్వహించబోతున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
పరీక్షకు వారం రోజుల ముందు నుంచే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
2022లో విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులు మళ్లీ ఇప్పుడు కూడా అప్లై చేసుకోవాలని కానీ మళ్ళీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది.
ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తామని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
యూనిఫాం సర్వీసులైన డిఎస్పి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మరియు ఆర్డీవో పోస్టులకు కనిష్ట గరిష్ట వయోపరిమితులు 21 నుండి 35 సంవత్సరాలుగా ఇచ్చారు. మిగిలిన పోస్టులకు 18 నుండి 46 సంవత్సరాలు వయసు ఇచ్చారు.
ఎస్సీ ,ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు మాజీ సైనికులకు మరియు NCC ఇన్స్ట్రక్టర్లకు మూడు సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఆర్డీవో పోస్టులకు మెకానికల్ , ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా దానికి సమానమైన డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
మిగిలిన అన్ని పోస్టులకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు అర్హులవుతారు. ఏసిల్ పోస్టుల భర్తీలో ఏదైనా డిగ్రీ తో పాటు సోషల్ వర్క్ లో పీజీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
డీఎస్పీ మరియు ఏఎస్ పోస్టులకు అభ్యర్థి ఎత్తు 165 సెంటీమీటర్లు ఉండాలి. చాతి చుట్టుకొలత 86.3 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరగాలి.
మొత్తం పోస్టులు : 563
రిజర్వేషన్ల వారీగా ఖాళీలు వివరాలు ఇలా ఉన్నాయి
OC – 209, EWS-49 , BC(A)-44, BC(B)- 37 , BC(C)-13, BC(D)-22, BC(E)-16, SC-93 , ST -52 , దివ్యాంగులు-24, క్రీడాకారులు-04
APPSC Group 2 సిలబస్ ప్రకారం పూర్తి క్లాస్ లు , Pdf మెటీరియల్స్, ప్రాక్టిస్ టెస్ట్స్ మొత్తం – 399/-
APPSC Forest Beat Officer కోర్స్ – 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..