ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మరో వారం రోజుల్లో ఐదు నోటిఫికేషన్స్ విడుదల చేయబోతున్నారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఇటీవల కాలంలో చాలా నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ముఖ్యంగా వీటిలో గ్రూప్ 1 గ్రూప్ 2 ,జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, మెడికల్ సర్వీసెస్ లో లైబ్రేరియన్ పోస్టులు, గిరిజన సంక్షేమ అధికారి పోస్టులు మరియు వివిధ రకాల పోస్టుల నోటిఫికేషన్స్ విడుదల చేశారు.
APPSC Group 2 సిలబస్ ప్రకారం పూర్తి క్లాస్ లు , Pdf మెటీరియల్, ప్రాక్టిస్ టెస్ట్స్ మొత్తం – 399/-
APPSC Forest Beat Officer కోర్స్ – 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
మరో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ, విద్యుత్ శాఖ , మత్స్య శాఖ, జైళ్ల శాఖ మరియు AP ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ విభాగం లో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ ఏపీపీఎస్సీ కొత్త నోటిఫికేషన్స్ విడుదల చేయబోతుంది.
అత్యధికంగా అటవీ శాఖలో లో 861 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు.
వీటిల్లో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, 70 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, 175 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, 375 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, 10 తానేదారులు, 12 టెక్నికల్ అసిస్టెంట్లు తో పాటు 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులే కాకుండా ఎఫ్ఎస్ఓ ,బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు లాంటి మరో 172 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కూడా భర్తీ చేస్తారు.
కాబట్టి అటవీ శాఖలో మొత్తం 861 ఉద్యోగాలు భర్తీకి వారం రోజుల్లోపు నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేస్తుంది.
ఇవే కాకుండా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, మత్స్య శాఖలో ఫిషరిస్ డెవలప్మెంట్ ఆఫీసర్, జైళ్ళ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ పోస్టులు మరియు ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు.