Headlines

ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు | KGH, Andhra medical College, Government College Of Nursing, Government School Of Nursing, Visakhapatnam Jobs | AP Contract / Outsourcing Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 పోస్టులు భర్తీ చేస్తుండగా ఇందులో అటెండర్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ , ఆఫీస్ సబార్డినేట్ వంటి పోస్టులతో పాటు వివిధ పారామెడికల్ పోస్టులు కూడా ఉన్నాయి.

 

ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టుల్లో కాంట్రాక్టు పోస్టులు – 29 , ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – 71 ఉన్నాయి.

 

ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజ్, కింగ్ జార్జ్ హాస్పిటల్ లో ఉన్న క్యాన్సర్ కేర్ యూనిట్, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ లలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేసుకోవాలి ? ఎప్పటినుండి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది ? మరియు వివిధ ముఖ్యమైన వివరాలు దిగువ ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుసుకొని అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి.

 

తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్, అప్లికేషన్, అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 

 

ఒక పోస్ట్ కు ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి. వేరువేరు పోస్టులకు వేరువేరుగా అప్లై చేయవచ్చు. 

 

ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క మెరిట్ జాబితా 28-02-2025 వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. 

 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) . APP లో కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. 

 

APPSC గ్రూప్ 2 పూర్తి కోర్స్ 399/- కే 

 

Download Our APP 

 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

 

Join Our What’s App Channel 

 

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. చివరి తేదీ 20-02-2024

 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్ర మెడికల్ కాలేజ్ , విశాఖపట్నం

 

రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, మెడికల్ ఫి రేడియో థెరపీ టెక్నీషియన్, మౌల్డ్ రూమ్ టెక్నీషియన్, CT టెక్నీషియన్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ , సిస్టం అడ్మినిస్ట్రేటర్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 , అనస్తీషియా టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, టైపిస్ట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ , హౌస్ కీపర్, ఎలక్ట్రిషన్ లేదా మెకానిక్ , అటెండర్, వాచ్మెన్, స్వీపర్, పర్సనల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఆఫీస్ సబార్డినేట్, ఆయా, ల్యాబ్ అటెండెంట్ , లైబ్రరీ అటెండెంట్ , క్లాస్ రూమ్ అటెండెంట్, ఫిజియోథెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, C-arm టెక్నీషియన్, OT టెక్నీషియన్, EEG టెక్నీషియన్, డైయాలసిస్ , జనరల్ డ్యూటీ అటెండెంట్స్ 

 

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 100 పోస్టులు 

 

అర్హత : 10th, Degree మరియు పోస్టులను అనుసరించి వివిధ అర్హతలు ఉండాలి.

 

నోటిఫికేషన్ విడుదల తేదీ: 10-02-2024

 

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 12-02-2024

 

అప్లికేషన్ చివరి తేదీ : 20-02-2024

 

ప్రొవిజినల మెరిట్ విడుదల లిస్ట్ తేదీ : 26-02-2024

 

ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 01-03-2024

 

అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ : 04-03-2024

 

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

 

గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు 

 

వయో సడలింపు : SC, ST, BC, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు. 

 

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా 

 

పరీక్ష విధానం : పరీక్ష లేదు 

 

ఫీజు : 

 

OC అభ్యర్థులకు ఫీజు 500/- రూపాయలు .

 

మిగతా అభ్యర్థులుకు ఫీజు 350/- 

 

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్

 

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది , కాబట్టి నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ నింపి సెల్ఫ్ అటిస్టెడ్ జిరాక్స్ కాపీలను జతపరిచి అప్లై చేయాలి.

 

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : ప్రిన్సిపల్ కార్యాలయం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, విశాఖపట్నం జిల్లా 

 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి .

 

అధికారిక వెబ్సైట్ 

 

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!