ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త . రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ-2024 నోటిఫికేషన్ 6,100 పోస్టులతో విడుదలైంది.
ఇటీవల ఈ ఉద్యోగాలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 12వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12వ తేదీ నుండి ఫిబ్రవరి 22వ తేదీ మధ్య అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి.
మొత్తం 6,100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఇందులో 2,280 ఎస్జీటీ పోస్టులు 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు , 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు, మరియు 42 ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12వ తేదీ నుండి అప్లై చేసే ప్రతి పోస్ట్ కు 750/- రూపాయలు చొప్పున ఫీజు చెల్లించి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 2018 సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తారు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సుల్లోని క్లాసులు అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది.
AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ Full Course – 499/- Only
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేదీ : మార్చి 5 నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయవచ్చు
పరీక్ష తేదీలు: మర్చి 15 నుండి 30 వరకు
ఈ పరీక్షలు రెండు సెషన్స్ లో నిర్వహిస్తారు.
మొదటి సెషన్ ఉదయం తొమ్మిది గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది.
రెండవ సెషన్ మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఉంటుంది.
ప్రాథమిక ‘ కీ ‘ విడుదల తేది: మార్చి 31
తుది ‘ కీ ‘ విడుదల తేది: ఏప్రిల్ 2
ఫలితాలు విడుదల తేదీ: ఏప్రిల్ 7