ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య , ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ RDMHS , జోన్ 3 నుండి విడుదల చేశారు. ఈ పోస్టులకు గుంటూరు, పల్నాడు , బాపట్ల , ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల అభ్యర్థులు స్థానిక అభ్యర్థులవుతారు. మిగతా జిల్లాల అభ్యర్థులు నాన్ లోకల్ అవుతారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోన్ 3 పరిధిలో ఉండే జిల్లాల్లో ఉండే వైద్య సంస్థల్లో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఇప్పటికే రెండవ జోన్ లో ఫార్మసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. రెండవ జోన్ నోటిఫికేషన్ కోసం క్రింద లింక్ పై క్లిక్ చేయండి.
Zone 2 Pharmacist Jobs Details
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? అర్హత ఏమిటి ? జీతం ఎంత ఇస్తారు ? వంటి పూర్తి వివరాలు దిగువన ఇవ్వబడినవి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సుల్లోని క్లాసులు అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : RDMS, గుంటూరు ( జోన్ – 3 )
పోస్టుల పేర్లు: ఫార్మసిస్ట్ గ్రేడ్ 2
అర్హత :
- D. ఫార్మసీ/ B. ఫార్మసీ/ ఫార్మా.D
- ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
మొత్తం ఉద్యోగాలు : 10
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 09-02-2024
అప్లికేషన్ చివరి తేదీ : 14-02-2024
ఫీజు :
ఓసి అభ్యర్థులు కు 500/-
SC ,ST, BC , విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు 300/-
- ఈ ఫీజు డిడి రూపంలో ఏదైనా జాతీయ బ్యాంకులో చెల్లించాలి.
- The Regional Director of Medical and Health Services, Zone 3, Guntur అనే పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా ఫీజు చెల్లించాలి.
వయస్సు : 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC , ST ,BC , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
జీతం : 32,670/-
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
The Regional Director of Medical and Health Services, RTC Bus Stand Back Side , Old Guntur, Guntur – 522001
అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్ [ శ్రీకాంత్ ( సీనియర్ అసిస్టెంట్ ) – 8885794371 ) ] సంప్రదించవచ్చు.
ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి వివరాలు చదివి అర్హత ,ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్ నింపి త్వరగా అప్లై చేయండి.
ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లై చేయండి.
✅ Download Notification & Application