ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 పోస్టులు భర్తీ చేస్తుండగా , ఇందులో ఏడు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, ఏడు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి.
✅ రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారికి మన యాప్ లో పూర్తి సిలబస్ ప్రకారం క్లాసులు అప్లోడ్ చేయడం జరిగింది.
RRB ALP , Technicians , NTPC, Group-D ఉద్యోగాల ( తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ) పూర్తి కోర్స్ కేవలం 499/- లకే ఇస్తున్నాము. యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్సులో ఉన్న డెమో క్లాసులు చూసి మీకు నచ్చితేనే కోర్సు తీసుకోవచ్చు.
APPSC గ్రూప్ 2 కోర్స్ ఇప్పుడు కేవలం – 399/- రూపాయలకే..
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ పార్వతీపురం మన్యం జిల్లాలో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు అసెంబ్లీ & పార్లమెంటు నియోజక వర్గాల రిటర్నింగ్ ఆఫీసర్స్ యొక్క కార్యాలయాల్లో ఉన్న ఖాళీలు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
అర్హతలు :
ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయి ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
అప్లికేషన్ చివరి తేదీ: ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు ఫిబ్రవరి 8వ తేదీ లోపు అప్లికేషన్ అందజేయాలి.
అప్లికేషన్ విధానము: ఈ పోస్టులకు అర్హులైన వారు అభ్యర్థి స్వయంగా వెళ్లి లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా అప్లికేషన్ పంపవచ్చు.
అప్లికేషన్ పంపవలసిన చిరునామా:
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ కార్యాలయం, పార్వతీపురం మన్యం జిల్లా
ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులను పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.